భారతదేశంలో ఎక్కువ మంది పిల్లలను కనడానికి ప్రోత్సాహం అందిస్తున్న మొదటి రాష్ట్రం సిక్కిం.రాష్ట్ర జనాభాను పెంచేందుకు సిక్కిం ప్రభుత్వం ప్రోత్సాహక ప్యాకేజీపై కసరత్తు చేస్తోంది.
ఎక్కువ మంది పిల్లలు కనే జంటల కోసం ప్రభుత్వం ప్రోత్సాహం ప్రకటించింది.ఎక్కువ మంది పిల్లలను కనే సమాజాలను ప్రోత్సహిస్తామని సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ పేర్కొన్నారు.
సిక్కింలో జాతి వర్గాల జనాభా తగ్గుతోందని ముఖ్యమంత్రి తెలిపారు.ఇటీవలి సంవత్సరాలలో సంతానోత్పత్తి రేటు చాలా తక్కువగా ఉందన్నారు.
సంతానోత్పత్తి రేటు పెంచేందుకు మహిళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం అన్నారు.

బిడ్డ పుడితే ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తారు?సిక్కింలో బిడ్డ పుడితే ఎన్నో సౌకర్యాలు అందిస్తారు.రాష్ట్రంలోని మహిళలకు ఒక సంవత్సరం ప్రసూతి సెలవులు ఇస్తారు.తండ్రికి 30 రోజుల సెలవు ఇస్తారు.
రాష్ట్రంలోని ప్రజలు పిల్లలను కనేలా ప్రోత్సహించడంతోపాటు రాష్ట్ర జనాభాను పెంచేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటోంది.సిక్కింలో సన్నాహాలు ఇలా.

సిక్కిం ప్రభుత్వం మహిళలు ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రోత్సహిస్తోంది.ఇందుకోసం పలు పథకాలను ప్రతిపాదించారు.మహిళా ఉద్యోగికి రెండో బిడ్డ పుడితే ఇంక్రిమెంట్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.మహిళా ఉద్యోగి మూడో సంతానాన్ని కంటే రెండు ఇంక్రిమెంట్లు ఇచ్చే ప్రతిపాదన ఉంది.
ఇదొక్కటే కాదు ప్రభుత్వం సామాన్యుల కోసం అనేక సౌకర్యాలు కూడా కల్పిస్తోంది.వారికి ఆర్థిక సాయం కూడా అందిస్తామమని తెలిపింది.
ఐవీఎఫ్ కోసం కూడా ప్రభుత్వ సహాయం సిక్కింలోని ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ సౌకర్యం ప్రారంభమైంది.రాష్ట్రంలో ఐవీఎఫ్ సదుపాయాన్ని ప్రారంభించామని, తద్వారా గర్భం దాల్చని మహిళలు కూడా పిల్లలను కనేలా ప్రోత్సహించాలని సీఎం తమాంగ్ కోరారు.ఐవీఎఫ్ ద్వారా మహిళలు తల్లులైతే వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తారు.రాష్ట్రంలో ఇప్పటి వరకు 38 మంది మహిళలు ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చారని సీఎం తెలిపారు.సిక్కిం జనాభా 7 లక్షల కన్నా తక్కువగానే ఉంది.







