బ్రూక్లిన్ మహిళ ఇంట్లోని ఫ్రీజర్‌లో అనేక మనిషి తలలు, శరీర భాగాలు.. పోలీసులు షాక్..

బ్రూక్లిన్‌కు( Brooklyn ) చెందిన ఒక మహిళ షాకింగ్ పని చేస్తూ చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.ఆమె తన అపార్ట్‌మెంట్‌లోని ఫ్రీజర్‌లో మనిషి తలలు, శరీర భాగాలను స్టోర్ చేస్తోంది.

 Many Human Heads And Body Parts In The Freezer Of A Brooklyn Woman's House Polic-TeluguStop.com

ఈ సంగతి తెలిసి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.ది డైలీ మెయిల్( The Daily Mail ) ఈ షాకింగ్ వార్తను నివేదించింది.

ఆ మహిళ పేరు హీథర్ స్టైన్స్.ఆమె వయస్సు 45 సంవత్సరాలు.

ఆమె బ్రూక్లిన్‌లోని నోస్ట్రాండ్ అవెన్యూలోని అపార్ట్‌మెంట్‌లో( Nostrand Avenue in Brooklyn ) నివసిస్తుంది.

ఆమె చేస్తున్న ఈ పనిని ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు.

కాల్ చేసిన వ్యక్తి 911కి డయల్ చేసి, ఆమె అపార్ట్‌మెంట్‌ని తనిఖీ చేయమని పోలీసులకు చెప్పాడు.రాత్రి 7.10 గంటల ప్రాంతంలో పోలీసులు ఆమె అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు.నేలపై చనిపోయిన వ్యక్తిని కనుగొన్నారు.

అతనికి ఊపిరి ఆడలేదు.ఆమె ఫ్రీజర్‌లో అనేక తలలు, శరీర భాగాలను కూడా వారు కనుగొని షాక్ అయ్యారు.

Telugu Brooklyn, Dna, Heather, Remains, Nri-Telugu NRI

పోలీసులు హీథర్ స్టైన్స్‌ను స్టేషన్‌కు( Heather Stines station ) తీసుకెళ్లారు.ఇంకా ఆమెపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు.డీఎన్‌ఏ పరీక్షల ఫలితాల కోసం వారు ఎదురుచూస్తున్నారు.డీఎన్‌ఏ పరీక్షల్లో తలలు, శరీర భాగాలు ఎవరికి చెందినవో తెలుస్తుంది.హీథర్ స్టైన్స్ అత్త అమీ ఈ వార్తతో షాక్ అయ్యింది.తన మేనకోడలు చేసిన పనిని తాను నమ్మలేకపోతున్నానని ఆమె డైలీ మెయిల్‌తో చెప్పింది.

Telugu Brooklyn, Dna, Heather, Remains, Nri-Telugu NRI

హీథర్ స్టైన్స్ పొరుగువారికి ఆమె గురించి పెద్దగా తెలియదు.ఇంతకుముందు రెండుసార్లు ఆమె అపార్ట్‌మెంట్‌లోకి చొరబడిందని వారు తెలిపారు.ఆమె ఎలా ఎందుకు చేస్తుందో తనకు తెలియదని వారన్నారు.ఆమె ఇలా వింతగా మానవ శరీర అవశేషాలను ఇంటికి తీసుకొచ్చి స్టోర్ చేస్తుందని తమకు ఐడియా లేదని వారు పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube