సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి( Surekha vani ) కుమార్తె సుప్రీత ( Supritha ) గురించి అందరికీ ఎంతో సుపరిచితమే.సుప్రీత ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నటువంటి ఈమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.
ప్రస్తుతం బిగ్ బాస్ ఫేం అమర్ దీప్( Amar Deep ) తో కలసి ఈమె ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇలా సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
అయితే ఇటీవల ఒక షోలో పాల్గొన్నటువంటి ఈమె ఒక సింగర్ పై తనకు క్రష్ ఉందని తెలిపారు.రీతు చౌదరి దావత్ అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు హాజరవుతున్నారు.
ఈ క్రమంలోనే సింగర్ శ్రీరామచంద్ర( Sri Rama Chandra ) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా రీతు చౌదరి మీరంటే ఇద్దరు అమ్మాయిలకు క్రష్ ఉందని శ్రీరామ చంద్రతో చెబుతుంది మరి ఎవరు ఆ అమ్మాయిలు అని అడగగా ఒక కుషిత అని చెప్పారు.ఆయన లాంటి మొగుడు కావాలి అంటూ ఈమె చెప్పినట్లు రీతూ చౌదరి వెల్లడించారు అలాగే సుప్రీత కూడా ఈ కార్యక్రమానికి హాజరైనప్పుడు తనుకు శ్రీరామచంద్ర అంటే క్రష్ ఉందని తనని నువ్వు అడుగు తను సింగిల్ గా ఉన్నాడేమో నేను కూడా సిగిలే అంటూ ఈమె చెప్పినట్లు రీతూ చౌదరి తెలిపారు.ఈ మాటలకు ఎంతో పొంగిపోయిన శ్రీరామచంద్ర తాను సింగిల్గానే ఉన్నాను అంటూ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ లో వైరల్ అవుతున్నాయి.
.