ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు.ఆన్‌లైన్‌లో కనుగొన్న కొత్త వ్యాపారాలు, కష్టపడి పనిచేసే వ్యక్తులు, అద్భుతమైన ప్రతిభలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తరచుగా పోస్ట్ చేస్తారు.
అయితే తాజాగా మహీంద్రా థార్ కారుతో ( Mahindra Thar car )లాగుతున్న ఓ పానీపూరీ బండి ఆనంద్ దృష్టికి వచ్చింది.ఒక అమ్మాయి ఈ పానీపూరీ బండిని మహీంద్రా థార్‌తో లాగుతున్న వీడియోను చూసి ఆనంద్ ఆశ్చర్యపోయారు.
మహీంద్రా థార్ కఠినమైన రోడ్లపై ఈజీగా దూసుకెళ్లగల శక్తివంతమైన కారు.ఆ అమ్మాయి, తన కలను సాకారం చేసుకోవడానికి ఈ కారును ఉపయోగించింది.ఆ లేడీ వ్యాపారి పేరు తాప్సీ( Taapsee ) ఉపాధ్యాయ, ఢిల్లీలో నివసిస్తోంది.కొన్నేళ్ల క్రితం తన సొంత పానీపూరీ వ్యాపారాన్ని ప్రారంభించింది.
దానికి బీ.టెక్ పానీపూరి వాలీ ( B.Tech Panipuri Valli )అని పేరు పెట్టింది.ఆమె తన బండిని స్కూటర్‌తో, తర్వాత బుల్లెట్ బైక్‌తో, ఇప్పుడు మహీంద్రా థార్‌తో లాగుతుంది.
ఆమె ధైర్యం, ఆశయం కారణంగా ఆమె కథ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆనంద్ మహీంద్రా తాప్సీ ఉపాధ్యాయ్( Taapsee Upadhyay ) వీడియోను ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్నారు.“ప్రజలు కొత్త ప్రదేశాలకు వెళ్లడం, కొత్త పనులు చేయడంలో ఆఫ్-రోడ్ వెహికల్స్ హెల్ప్ చేస్తాయి.ప్రజలు ఎదగడానికి, వారి కలలను నెరవేర్చుకోవడానికి మా కార్లు సహాయపడాలని మేం కోరుకుంటున్నాం.
అందుకే ఈ వీడియో నాకు బాగా నచ్చింది.” అని ఈ వీడియో పోస్ట్‌కు ఆనంద్ మహీంద్రా క్యాప్షన్ జోడించారు.
వీడియోని చాలా మంది లైక్ చేసారు.వీడియోకు దాదాపు 2 లక్షల వ్యూస్, అనేక వ్యాఖ్యలు వచ్చాయి.టెక్నాలజీ ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుందని ఒకరు పేర్కొన్నారు.“విభిన్న విజయాలపై ఇంట్రెస్ట్స్ చూపిస్తున్నందుకు అభినందిస్తున్నాం.దయచేసి పోస్ట్ చేస్తూ ఉండండి.ఆ అమ్మాయికి జీవితంలో మంచి జరగాలని కోరుకుంటున్నా” అని ఒక యూజర్ కామెంట్ చేశారు.