శనగ పంట( Chickpea Crop ) ప్రధాన పప్పు దినుసుల పంటలలో ఒకటి.శనగ పంటకు నీటి అవసరం చాలా అంటే చాలా తక్కువ కాబట్టి నల్లరేగడి నేలలలో వర్షాధార పంటగా అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతోంది.
శనగ పంట స్వల్పకాలిక పంట.శనగ పంటను రబీలో( Rabi ) సాగు చేస్తారు.శనగ పంట విత్తుకోవడానికి అక్టోబర్ నుండి నవంబర్ వరకు అనుకూలమైన సమయం.
శనగ పంట సాగుకు తేమశాతం ఎక్కువగా ఉండే బరువైన నల్ల రేగడి నేలలు చాలా అంటే చాలా అనుకూలం.
శనగ పంట సాగుకు నీరు నిల్వ ఉండే నేలలు, చౌడు నేలలు అసలు పనికిరావు.నేల యొక్క పీహెచ్ విలువ( pH Value ) 6-7 మధ్యన ఉంటే సాగుకు అత్యంత అనుకూలం.
ఒక ఎకరాకు ఐదు టన్నుల పశువుల ఎరువుతో( Cattle Manure ) పాటు 10 కిలోల యూరియా, 20 కిలోల భాస్వరం వేసుకొని పొలాన్ని రెండు లేదా మూడుసార్లు దున్ని వదులుగా అయ్యేలాగా దమ్ము చేసుకోవాలి.
శనగ పంట విత్తడానికి ముందు విత్తన శుద్ధి( Seed Purification ) చేసుకోవాలి.అప్పుడే నేల నుంచి ఎలాంటి తెగుళ్లు పంటను ఆశించే అవకాశం ఉండదు.కాబట్టి ఒక కిలో విత్తనాలను ఎనిమిది గ్రాముల ట్రైకోడెర్మా విరిడి లేదంటే 3 గ్రాముల కాప్టన్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి.
మధ్యస్థ పరిమాణం గింజలు అయితే ఒక ఎకరాకు 30 కిలోలు, పెద్ద పరిమాణం గింజలు అయితే ఒక ఎకరాకు 45 కిలోలు అవసరం.
శనగ పంట విత్తుకోవడం ఆలస్యం అయితే పంట పూత దశలో ఉన్నప్పుడు అధిక ఉష్ణోగ్రతల వల్ల పూత ర్యాలిపోయే అవకాశం చాలా ఎక్కువ.కాబట్టి సకాలంలో పంట విత్తుకోవాలి.విత్తే సమయంలో కచ్చితంగా తేమ ఉండేలా చూసుకోవాలి.
ఈ పంటకు నీటి వినియోగం చాలా తక్కువ కాబట్టి పూత మొదలయ్యే 30-35 రోజుల మధ్య గింజ బలపడే దశలో నీటిని అందించాలి.ఇక పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.