దళితులపై నారా భువనేశ్వరి అసభ్య పదజాలం.. ఫేక్ కాదని నిర్ధారణ..!!

ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండటంతో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. పోలింగ్ కు రెండు వారాలు మాత్రమే ఉండటంతో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

 Nara Bhuvaneshwari's Obscenities Against Dalits.. Confirmed Not Fake , Ap Electi-TeluguStop.com

ఈ క్రమంలోనే అధికార, విపక్ష కూటమి నేతల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది.ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో( Social media) వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

నారా భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) పేరిట సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఆ ఆడియో ఫేక్ కాదని తెలుస్తోంది.

ఈ భువనేశ్వరి బూతుల ఆడియో డీప్ ఫేక్ కాదని కేంద్రానికి చెందిన డీప్ ఫేక్స్ అనాలసిస్ యూనిట్ నిర్ధారించిందని సమాచారం.దీంతో దళితులపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీలో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భువనేశ్వరి మాటలపై వైసీపీ( YCP ) క్యాడర్ తో పాటు దళితులు తీవ్రంగా మండిపడుతున్నారు.

‘‘ నేను నీకంటే పెద్దింట్లో పుట్టిన దాన్ని.

చెత్త బుట్టలో పుట్టారు.అయినా వేషాలు వేస్తున్నారు.

దేనికీ పనికిరారు.అడుక్కుతినే వెధవల్లారా …పోరా కిందకు.

ఉడిగం చేసే వెధవ.నేను మీ అందరికి మానిటరింగ్ చేస్తానా.

’’ అంటూ అసభ్యపదజాలాన్ని ఉపయోగించారని ఆడియో వైరల్ అవుతుంది.కాగా భువనేశ్వరి పేరిట బయటకు వచ్చిన ఆడియోపై టీడీపీ ఘాటుగా స్పందించింది.అందులో ఉన్న వాయిస్ భువనేశ్వరిది కాదని కొట్టిపారేసింది.వైసీపీ ఓటమి భయంతో అసత్య ప్రచారాలు చేస్తోందంటూ మండిపడింది.అయితే తాజాగా భువనేశ్వరి ఆడియో డీప్ ఫేక్ కాదని కేంద్రానికి చెందిన డీప్ ఫేక్స్ అనాలసిస్ యూనిట్ ప్రకటించిందని తెలుస్తోంది.దీంతో ఇది వైసీపీ ( YCP )చేసిన ప్రచారం కాదని, నిజమేనని తేలిందని ఏపీలో పలువురు చెబుతున్నారు.

దళితులపై గతంలో చంద్రబాబు ( Chandrababu)కూడా అనుచిత వ్యాఖ్యలు చేయగా.ఇప్పుడు ఆయన సతీమణి వారిని నీచంగా చూస్తూ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube