10 ఏళ్ళ వయసులో మేకలా పాడుతుందని సంగీతం క్లాస్ నుంచి తీసేసారు..కానీ నేడు ప్రపంచమే ఆమెకు దాసోహం

షకీరా ( Shakira )… 46 ఏళ్ళ ఒక కొలంబియన్ గాయని.పూర్తి పేరు షకీరా ఇసాబెల్ మెబారాక్ రీపోల్( Isabel Mebarak Repol ).

 Shakira Removed From Music Classes In School , Shakira, Colombian Singer, Isa-TeluguStop.com

ఈమె సింగర్ గా, డ్యాన్సర్ గా, మాడల్ గా, ప్రొడ్యూసర్ గా, గేయ రచయితగా పలు రంగాలలో నిష్ణాతురాలిగా అందరికి పరిచయమే.ప్రస్తుతం షకీరా బెల్లి డ్యాన్స్ షో లు కూడా ఇస్తున్నారు.

ఆమె బ్యారాంక్విలా లో పుట్టినప్పటి రాక్ అండ్ రోల్, అరబిక్, లాటిన్ వంటి వాటికి ప్రభావం చెంది వాటిలో తన అడుగులు వేసి సక్సెస్ అయ్యారు.ఇక తన గానం తో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేళా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న షకీరా సోషల్ మీడియాలో సైతం తిరుగులేని రికార్డులను కొల్లగొట్టారు.

మరి ముఖ్యంగా షకీరా కు తన ఇంస్టా లో పది కోట్ల లైక్స్ రావడం తో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా చరితలో నిలిచిపోయింది.

Telugu Arabic, Colombian, Isabelmebarak, Latin, Rock Roll, Shakira, Soccer-Lates

ఆమె సంగీత ప్రపంచం గురించి ఎంత చెప్పిన తక్కువే.పాశాత్య సంగీతతో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది షకీరా.ప్రస్తుతం ఆమె హవా కొంచం తగ్గిన టీవీ ల్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ బాగానే ఆర్జిస్తోంది.

షకీరా బయోగ్రఫీ పై అనేక డాక్యుమెంటరీ లు కూడా వచ్చాయి.ఇక గత 12 ఏళ్లుగా ఒక సాకర్ ప్లేయర్( soccer player ) తో రిలేషన్ లో ఉంటున్న షకీరా ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లి.

సదరు సాకర్ ప్లేయర్ ని మాత్రం ఇంకా పెళ్లి చేసుకోక పోవడం విశేషం.

Telugu Arabic, Colombian, Isabelmebarak, Latin, Rock Roll, Shakira, Soccer-Lates

ఇక చాల మందికి తెలియని ఒక గమ్మత్తయిన విషయం ఏమిటి అంటే షకీరా కు పదేళ్ల వయసు ఉన్నప్పుడు స్కూల్ లో ఎంతో ఆసక్తి గా సంగీతం నేర్చుకోవాలని అనుకుంది.అందుకోసం స్కూల్ లో మ్యూజిక్ క్లాసెస్ కూడా అటెండ్ అయ్యింది.అయితే కొన్ని రోజులకే ఆమె మ్యూజిక్ టీచర్ షకీరాను మ్యూజిక్ క్లాసెస్ నుంచి తీసేసింది.

ఎందుకంటే ఆమె పాడుతుంటే అచ్చం మేక అరుస్తున్నట్టు ఉందని చెప్పారట.కానీ ఈ రోజు అదే గొంతుతో ఆమె మ్యాజిక్ చేస్తుండటం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube