రోజు మార్నింగ్ ఈ ఒక్కటి తీసుకుంటే మలబద్ధకం వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పరార్ అవుతుంది!

మలబద్ధకం ( Constipation )అనేది చాలా మంది చాలా కామన్ గా ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి.కానీ ఎక్కువ శాతం మంది ఈ సమస్యను ఇతరులతో చర్చించేందుకు ఇష్టపడరు.

 Best Smoothie To Get Rid Of Constipation Naturally, Constipation, Constipation R-TeluguStop.com

అలా అని మలబద్ధకం సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఎన్నో జబ్బులు తలెత్తుతాయి.అందుకే కొందరు మలబద్ధకం నుంచి బయటపడటం కోసం మందులు వాడుతుంటారు.

కానీ సహజంగా కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే స్మూతీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

రోజు మార్నింగ్ ఈ స్మూతీని తీసుకుంటే మలబద్ధకం వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పరార్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక క్యారెట్( Carrot _ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.అలాగే ఒక యాపిల్ తీసుకుని వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.,/br>

ఇప్పుడు బ్లండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆపిల్ ముక్కలు,( Apple slices ) క్యారెట్ ముక్కలు వేసుకోవాలి.అలాగే అరకప్పు ఫ్రెష్ క్యాబేజీ తరుగు, చిటికెడు మిరియాల పొడి మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న స్మూతీని రోజు బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు తీసుకోవాలి.ఈ స్మూతీలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.అలాగే మరెన్నో పోషకాలు సైతం నిండి ఉంటాయి.రోజు ఉదయం ఈ స్మూతీని తీసుకుంటే ఎలాంటి మలబద్ధకం అయిన పరార్ అవుతుంది.

మలబద్ధకం సమస్యకు సహజంగానే చెక్‌ పెట్టడానికి ఈ స్మూతీ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.అలాగే ఈ స్మూతీని డైట్ లో చేర్చుకుంటే జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.

రక్తంలో చక్కెర( Blood sugar ) స్థాయిలు అదుపులో ఉంటాయి.వెయిట్ లాస్ అవుతారు.

రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.మరియు చర్మం సైతం యవ్వనంగా కాంతివంతంగా మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube