సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి శృతిహాసన్ ( Shruti Haasan ) ఒకరు.ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ వరుస భాషా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
అయితే శృతిహాసన్ ఇదివరకే ప్రేమలో పడి తన ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే.ఇలా ఈ విషయం నుంచి బయటపడినటువంటి ఈమె ముంబైకి చెందినటువంటి డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికా( Santanu Hazarika ) తో ఈ భామ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
ఇలా ముంబైలో వీరిద్దరూ సహజీవనం చేస్తూ ఇన్ని రోజులు ఎంతో ఎంజాయ్ చేస్తూ గడిపారు.
ఇక శృతిహాసన్ తరచూ తన ప్రియుడుతో ఉన్నటువంటి ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదిక అభిమానులతో పంచుకుంటూ ఉండేవారు.అయితే తాజాగా వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.బాలీవుడ్ సమాచారం ప్రకారం వీరిద్దరూ బ్రేకప్( Break Up ) చెప్పుకున్నారని తెలుస్తోంది.
కొన్ని వ్యక్తిగత విభేదాల కారణంగా శృతిహాసన్ తన ప్రియుడికి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.అంతేకాకుండా వీరిద్దరూ కూడా సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకోవటం గమనార్హం.
ఇలా వీరిద్దరూ సోషల్ మీడియా( Social Media )లో అన్ ఫాలో చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోస్తుంది.ఇలా వీరిద్దరు విడిపోయారంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా ఈ ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా.ఇతరులనూ అర్థం చేసుకున్నా అంటూ శృతిహాసన్ పెట్టిన పోస్ట్ కూడా వారి బ్రేకప్ను నిర్ధారిస్తున్నదని అమె అభిమానులు భావిస్తున్నారు.మరి వీరిద్దరి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం తెలియలేదు.
కానీ ప్రస్తుతం మాత్రం వీరి బ్రేకప్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి వీరి విషయంలో అసలు వాస్తవాలు తెలియాలి అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంటుంది.