రీ రిలీజ్ కి సిద్ధమైన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్... ఎన్నికలలో హైప్ కోసమేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ప్రస్తుతం తాను నటించాల్సిన సినిమాలు అన్నింటిని కూడా పక్కన పెట్టేసి రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ( Janasena Party ) తరపున పిఠాపురం ( Pithapuram ) నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

 Pawan Kalyan Vakeel Sab Movie Re Release Details Goes Viral , Pawan Kalyan, Vake-TeluguStop.com

ఇలా ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఎలాగైనా ఈ ఎన్నికలలో గెలుపు అందుకోవాలని ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Telugu Ap, Pawan Kalyan, Pawankalyan, Vakeel Saab-Movie

ఇలా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నటువంటి తరుణంలో ఈయన నటించిన వకీల్ సాబ్( Vakeel Saab ) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.2021 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.డైరెక్టర్ వేణు శ్రీరామ్ ( Director Venu Sriram )దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో మంచి ఆదరణ పొందింది.ఇందులో పవన్ కళ్యాణ్ వకీల్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Telugu Ap, Pawan Kalyan, Pawankalyan, Vakeel Saab-Movie

ఓ రాజకీయ నాయకుడి కుమారుడి తప్పుడు కేసు కారణంగా ముగ్గురు అమ్మాయిలు జీవితం( Three Girls Life ) బలైపోతున్నటువంటి తరుణంలో ఆ కేసును వాదించి పవన్ కళ్యాణ్ వారి జీవితాలను ఎలా కాపాడారు అన్న నేపథ్యంలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా తిరిగి మే ఒకటవ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.ఇలా ఎన్నికలకు కొద్ది రోజులు ముందుగా ఈ సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ కు మంచి మైలేజ్ క్రియేట్ చేయడానికి ఈ సినిమాని తిరిగి విడుదల చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు.ప్రస్తుతం రీ రిలీజ్( Vakeel Saab Re Release ) సినిమాలకు ఆదరణ తగ్గింది అయితే ఇప్పుడు ఎన్నికలు ఉన్నటువంటి తరుణంలో విడుదల కాబోతున్నటువంటి వకీల్ సాబ్ సినిమాకు ఎలాంటి ఆదరణ వస్తుందనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube