కరోనా వంటి కష్టకాలంలోనూ మ్యానిఫెస్టో అమలు చేశామని సీఎం జగన్( CM Jagan ) అన్నారు.వైసీపీ పాలన కొనసాగిన 58 నెలల కాలంలో పథకాలు అన్నింటినీ డోర్ డెలీవరీ చేశామని తెలిపారు.
మ్యానిఫెస్టో( Manifesto) అమలుకు కరోనా కాలంలోనూ ఎలాంటి సాకులు చూపలేదని సీఎం జగన్ పేర్కొన్నారు.గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పామన్నారు.2014 లో కూటమిగా ఏర్పడిన చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేశారా అని ప్రశ్నించారు.2014 లో కూటమికి ఓటు వేసేందుకు ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయని మండిపడ్డారు. రుణమాఫీ, పొదుపు సంఘాల( Chandrababu ) రుణాలపై కూటమి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.మ్యానిఫెస్టోను బైబిల్ గా, ఖురాన్ గా, భగవద్గీతగా భావించామని తెలిపారు.99 శాతం హామీలు అమలు చేశామన్న సీఎం జగన్ రూ.2 లక్షల 70 కోట్లను డీబీటీ ద్వారా అందించామని వెల్లడించారు.