మంత్రి కోమటిరెడ్డివి చిల్లర మాటలు..: జగదీశ్ రెడ్డి

కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి( Guntakandla Jagadish Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మంత్రి కోమటిరెడ్డివి చిల్లర మాటలని పేర్కొన్నారు.

 Small Words Of Minister Komati Reddy..: Jagadeesh Reddy ,harish Rao , Kcr , Br-TeluguStop.com

రాజీనామా లేఖ ఎలా రాయాలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రాసి పంపితే హరీశ్ రావు( Harish Rao ) కూడా అలానే రాసిస్తారని తెలిపారు.కేసీఆర్( KCR ) రుణం తీర్చుకోవడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు మరోసారి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు.కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం లేదన్న ఆయన రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube