మంత్రి కోమటిరెడ్డివి చిల్లర మాటలు..: జగదీశ్ రెడ్డి

కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి( Guntakandla Jagadish Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మంత్రి కోమటిరెడ్డివి చిల్లర మాటలని పేర్కొన్నారు.రాజీనామా లేఖ ఎలా రాయాలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రాసి పంపితే హరీశ్ రావు( Harish Rao ) కూడా అలానే రాసిస్తారని తెలిపారు.

కేసీఆర్( KCR ) రుణం తీర్చుకోవడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు మరోసారి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు.

కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం లేదన్న ఆయన రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అనుదీప్ కె వి విశ్వక్ సేన్ కి సక్సెస్ ఇస్తాడా..?