బోండా ఉమ ఎన్నికల అఫిడవిట్ తప్పులతడక..: వెల్లంపల్లి

విజయవాడ( Vijayawada )లో టీడీపీ నేత బోండా ఉమ, వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.తాజాగా బోండా ఉమపై వెల్లంపల్లి( Vellampalli Srinivas) మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 Bonda Uma Election Affidavit Is Wrong..: Vellampalli ,bonda Umama, Vellampalli-TeluguStop.com

బోండా ఉమ( Bonda Umama ) ఎన్నికల అఫిడవిట్ తప్పులతడకని వెల్లంపల్లి ఆరోపించారు.అధికారులను తప్పుదోవ పట్టించి ఓట్లను నమోదు చేయించుకున్నారన్నారు.

సింగ్ నగర్ టీడీపీ కార్యాలయం అడ్రస్ తో ఓట్లు నమోదు అయ్యాయని వెల్లంపల్లి తెలిపారు.ఎన్నికల నియమావళి ప్రకారం ఇంటి చిరునామాతోనే ఓట్లు ఉండాలని చెప్పారు.

ఒక దగ్గర నివసిస్తూ బోండా ఉమ మరో చోట పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత బోండా ఉమకు లేదని చెప్పారు.

బోండా ఉమ ఓటు తొలగించే వరకు పోరాడుతానని తెలిపారు.బోండా ఉమపై ఉన్న కేసులపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube