ఏపీ సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) మేనిఫెస్టోను ప్రకటించారు.ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలలో సీఎం జగన్ స్వల్ప మార్పులు చేసి అవే పథకాలను ప్రకటించడం గమనార్హం.
అయితే తాను కొన్ని హామీలు ఇచ్చినా ఆ హామీలను కచ్చితంగా అమలు చేస్తానని చెప్పడం జగన్ కు ఎంతగానో ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.
దశల వారీగా పింఛన్ 3500కు పెంచుతామని తెలిపారు.
రైతు భరోసా పథకం( Rythu Bharosa Scheme ) నిధులను 16,000 రూపాయలకు పెంచుతామని సీఎం జగన్ పేర్కొన్నారు.
రైతులకు ఉన్న పథకాలన్నీ యథాతథంగా కొనసాగిస్తామని జగన్ తెలిపారు.అమ్మఒడి స్కీమ్( Ammavodi ) నగదును 17 వేల రూపాయలకు పెంచుతామని సీఎం వెల్లడించడం గమనార్హం.ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్ ఇస్తామని జగన్ వెల్లడించారు.కులవృత్తులకు జగనన్న చేదోడు కొనసాగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు.
![Telugu Cmjagan, Ebc Nestham, Jagan Manifesto, Jaganmanifesto, Rythu Bharosa, Ycp Telugu Cmjagan, Ebc Nestham, Jagan Manifesto, Jaganmanifesto, Rythu Bharosa, Ycp](https://telugustop.com/wp-content/uploads/2024/04/ap-cm-jagan-ycp-manifesto-goes-viral-in-social-media-detailsd.jpg)
రాబోయే ఐదేళ్లు వైద్యంపై స్పెషల్ ఫోకస్ పెడతామని జగన్ వెల్లడించారు.వైఎస్సార్ చేయూత పథకంను నాలుగు విడతల్లో లక్షా 50 వేల రూపాయలకు పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు.వైఎస్సార్ కాపునేస్తం( YSR Kapu Nestham ) స్కీమ్ కొనసాగుతుందని 60 వేల రూపాయల నుంచి 1,20,000 రూపాయల వరకు బెనిఫిట్ కలుగుతుందని జగన్ హామీ ఇచ్చారు.
![Telugu Cmjagan, Ebc Nestham, Jagan Manifesto, Jaganmanifesto, Rythu Bharosa, Ycp Telugu Cmjagan, Ebc Nestham, Jagan Manifesto, Jaganmanifesto, Rythu Bharosa, Ycp](https://telugustop.com/wp-content/uploads/2024/04/ap-cm-jagan-ycp-manifesto-goes-viral-in-social-media-detailsa.jpg)
నాలుగు దఫాల్లో ఈబీసీ నేస్తం 1,05,000కు పెంచుతామని జగన్ తెలిపారు.కౌలు రైతులకు సైతం రైతు భరోసా స్కీమ్ అమలు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.వైఎస్సార్ సున్నావడ్డీ కింద మూడు లక్షల రూపాయల రుణం ఇస్తామని జగన్ పేర్కొన్నారు.
ఇప్పటికే అమలవుతున్న పథకాల అమలు దిశగానే జగన్ అడుగులు వేశారు.అయితే సూపర్ సిక్స్ హామీల బెనిఫిట్స్ మరింత మెరుగ్గా ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
జగన్ మేనిఫెస్టో ( Jagan Manifesto ) విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.