ప్రస్తుత సమాజంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలలో ముఖ్యమైన సమస్య శ్వాస సమస్య( Breathing problem ).శ్వాస తీసుకునే క్రమంలో ఇబ్బందులు పడడం, లేకపోతే ఊపిరితిత్తులకు( lungs ) సంబంధించిన సమస్యలతో బాధపడడం వంటివి జరుగుతూ ఉంటాయి.
శ్వాస తీసుకునే సామర్థ్యం చాలా మంది పెంచుకోవాలని అనుకుంటూ ఉంటారు.అందుకోసం రకరకాల పద్ధతుల్ని అనుసరిస్తుంటారు.
అయితే ఊపిరితిత్తుల కెపాసిటీని పెంచుకొని ఊపిరి తీసుకునే సామర్ధ్యాన్ని పెంచుకోవాలంటే కచ్చితంగా ఈ చిట్కాలను పాటించాలి.శ్వాసకి సంబంధించిన వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తే శ్వాస సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చు.
ముఖ్యంగా ఆస్తమా, సిపిఓడి సమస్యతో బాధపడే వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇది కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా చెప్పాలంటే కార్డియా వాస్కులర్ వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తే కూడా మీ యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.
ముఖ్యంగా చెప్పాలంటే బ్రీతింగ్ సమస్యలతో బాధపడే వాళ్ళకి డయాబెటిస్, ఒబిసిటీ ( Diabetes, obesity )సమస్యతో బాధపడే వాళ్ళకి కూడా కార్డియా వాస్కులర్( Cardia Vascular ) పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే యోగా గురించి చాలా మందికి తెలియదు.యోగా చాలా ఆసనాలు బ్రీతింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
యోగా చేయడం వల్ల ఒత్తిడిని కూడా దూరం చేసుకోవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే సైక్లింగ్ చేయడం వల్ల కూడా లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది.
అంతే కాకుండా ఒత్తిడి కూడా తగ్గిపోతుంది.ఇంకా చెప్పాలంటే స్విమ్మింగ్ ద్వారా కూడా మీ యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.
శ్వాసకి సంబంధించిన సమస్యతో బాధపడే వాళ్లకి స్విమ్మింగ్ చేయడం ఎంతగానో ఉపయోగపడుతుంది.కాబట్టి శ్వాస సమస్యలతో బాధపడుతున్న వారు కచ్చితంగా ఈ నియమాలను పాటించడం ఎంతో మంచిది.
ఈ నియమాలను పాటించడం వల్ల శ్వాస సామర్థ్యం కూడా పెరుగుతుంది.