టాలీవుడ్ మోస్ట్ వెయిటింగ్ మల్టీస్టారర్ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.స్వాతంత్య్రంకు పూర్వం పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందబోతుంది.
భారీ అంచనాల నడుమ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్, ఎన్టీఆర్ లు చాలా కష్టపడి విభిన్నంగా కనిపించబోతున్నారు.ప్రస్తుతం ప్రత్యేక శిక్షణ కోసం ఎన్టీఆర్ దుబాయి వెళ్తే మరో వైపు రామ్ చరణ్ తో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మెగా మల్టీస్టారర్ చిత్రంలో హీరోయిన్స్‌గా బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఆలియా భట్ మరియు పరిణితి చోప్రాలను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.పరిణితి చోప్రా ఎంపిక వార్తలు పుకార్లే అని, ఆలియా భట్‌ను మాత్రం ఎంపిక చేయడం కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తోంది.ఆరు కోట్లు డిమాండ్ చేసిన ఆలియా భట్ మొదట జక్కన్నను భయపెట్టింది.అయితే బాహుబలి సినిమా ట్రాక్ రికార్డును దృష్టిలో పెట్టుకుని ఆలియా భట్ తన పారితోషికంను తగ్గించుకుని, రాజమౌళి కోరిన మొత్తానికి ఒప్పుకుందట.

ఆలియా భట్ ఒక హీరోయిన్‌గా దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లే.ఇక రెండవ హీరోయిన్‌గా ఫారిన్ ముద్దుగుమ్మను ఎంపిక చేయాల్సి ఉంది.ముందు నుండి అనుకుంటున్నట్లుగా ఈ చిత్రంలో ముగ్గురు ముద్దుగుమ్మలు కనిపించడం లేదు.కేవలం ఆలియా మాత్రమే ఉంటుంది, ఆమెకు తోడు కీలక పాత్రలో ఫారిన్ బ్యూటీ నటించబోతుందట.
ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ మల్టీస్టారర్ మూవీ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.







