ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు ఓటుకు నోటు కేసుపై సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది.
ఆర్కే పిటిషన్ పై జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు చేర్చాలని, ఆ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆయన మరో పిటిషన్ ను కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే కేసు విచారణను వాయిదా వేయాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ఓటుకు నోటుకేసులో విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసిన సుప్రీంకోర్టు జనవరి రెండో వారంలో తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది.