నల్లగొండ జిల్లా:ఓటు ఎవరికి వెయ్యాలి అనే విషయం కంటే,ఎవరికి వేయకూడదు అనేది చాలా ముఖ్యం.డబ్బిచ్చారు కాబట్టి ఓటు వేద్దాం.
మనవాళ్ళు ఉన్నారు కాబట్టి ఓటు వేద్దాం.మన కుల పెద్దలు చెప్పారు కాబట్టి ఓటు వేద్దాం.
మన కులం కాబట్టి ఓటు వేద్దాం.మన పార్టీ కాబట్టి ఓటు వేద్దాం.అనుకుంటున్నారా? అలా చేస్తే నిన్ను,నీ కుటుంబాన్ని అమ్ముకోవడమే, మీ పిల్లలను మోసంచేయడమే అవుతుంది.జాగ్రత్త…ఇవాళ ఇచ్చే గ్యారంటీలు,హామీలు,డబ్బు,మద్యం తాత్కాలికం.వీటి కోసం ఓటు వేయడం మంచిది కాదు.భవిష్యత్తు కోసం,సమాజం కోసం, భావితరాల కోసం,మనకోసం ఓటు వేయండి.