మన భారతదేశంలో చాలామంది ప్రజలు దర్గాలకు వెళ్లి అక్కడ గురువులు బోధించే మంచి మాటలను ఎక్కువగా వింటూ ఉంటారు.ఇస్లాం సూఫీ తత్వాన్ని బోధిస్తూ కులమతాలకు అతీతంగా ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచుతూ మానవత్వానికే పెద్ద పీట వేస్తున్న కడప అమీన్ పీర్ దర్గాకు ఎంతో విశిష్టత ఉంది.
ఈ దర్గాను దక్షిణ భారత అజ్మీర్ గా చాలామంది ప్రజలు పిలుస్తారు ఈ దర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలు ఈనెల 7 తేదీ నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయి ఈ దర్గా చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం 16వ శతాబ్దంలో కర్ణాటకలోని బీదర్ పరిసర ప్రాంతాల నుంచి మహా ప్రవక్త వంశీయులైన ఖ్వాజాయే ఖాజుగా నాయబె రసూల్ అతాయే రసూలుల్లాహ్ హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లా మాలిక్ సాహెబ్ వారి సతీమణి, కుమారులు హజరత్ ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్, హజరత్ అహ్మద్ హుసేనీ సాహెబ్ లతోపాటు భక్తగణంతో ఈ ప్రాంతానికి బోధనలు చేస్తూ వచ్చారు.
అంతేకాకుండా ఈ మహానుభావులు ఆధ్యాత్మిక బోధనలతో అందరినీ ఆకట్టుకున్నారు.
అప్పటి కడప నవాబులు వీరి మహిమలను చూసి ప్రియ భక్తులు అయ్యారు.వారి కోరిక మేరకు గురువులు కడప నగరంలోనే ఉన్నారు.
హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్ పై అసూయతో కొందరు స్థానికులు సవాలు విసిరారు.దాని ప్రకారం ఆయన జీవ సమాధి అయిన మూడవరోజున కనిపించడం వల్ల శత్రువులు కూడా భక్తులుగా మారిపోయారు.
అయితే హజరత్ అమీనుల్లా హుసేనీ సాహెబ్ 10వ పీఠాధిపతిగా పూర్తి బాధ్యతలను నిర్వహించారు.ఆయన పేరుతోనే దర్గాను అమీన్‌పీర్ సాహెబ్ దర్గాగా పిలుస్తూ ఉంటారు.
కాలక్రమంలో అది అమీన్‌పీర్ దర్గాగా మారిపోయింది.
ప్రస్తుతం దర్గా 11వ పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఆధ్వర్యంలో ఉంది.దర్గాలో మొత్తం గురువులు, వారి వారసుల పేరిట ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం యేటా మొత్తం 11 చిన్న ఉరుసులు, గంధం ఉత్సవాలు చేస్తూ ఉంటారు.ప్రస్తుతం పెద్ద ఉరుసును వారం రోజులపాటు అత్యంత వైభవంగా చేస్తారు.
చాలా విదేశాల నుంచి కూడా ఈ ఉరుసుకు ఎంతోమంది భక్తులు, సెలబ్రిటీలు హాజరవుతారు.
DEVOTIONAL