రక్తహీనత లేదా ఎనీమియా.చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది.శరీరంలో ఉన్న ఎర్ర రక్త కణాలు తగినంతగా లేకపోవడం, హిమోగ్లోబిన్ సరిపడినంతగా ఉండకపోవడం వల్ల రక్త హీనత సమస్యను ఏదుర్కోవాల్సి వస్తుంది.ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళలు ఈ సమస్య బారిన పడుతుంటారు.
రక్తహీనత సమస్య ఎక్కువకాలం కొనసాగితే.గుండె, మెదడు, ఇతర అవయవాలకు ప్రభావం పడి ప్రాణాలే ప్రమాదంలో పడతాయి.
అయితే హీమోగ్లోబిన్ పురుషులో పన్నెండు పాయింట్ల కంటే తక్కువ, మహిళల్లో పది పాయింట్ల కంటే తక్కువ ఉంటే రక్త హీనత సమస్య ఉన్నట్టు.ఈ విషయం బ్లడ్ రెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది.
కానీ, కొన్ని లక్షణాల బట్టీ కూడా రక్త హీనత సమస్య ఉందా.లేదో తెలుసుకోవచ్చు.
మరి ఆ లక్షణాలు ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.రక్తహీనత సమస్య ఉన్న వారు త్వరగా అలసిపోవడం, తరచూ తలనొప్పి వంటివి ఫేస్ చేస్తుంటారు.

అలాగే ఎక్కువ సమయం నడిచినా, పని చేసినా శ్వాస సరిగ్గా అందక ఇబ్బంది పడుతుంటారు.కళ్లు, నాలుక, చర్మం పాలిపోతుంటాయి.రక్తహీనత ఉంటే ఎలాంటి వాతావరణంలో అయినా విపరీతమైన చలి పుడుతుంటుంది.మరియు చేతులు, కాళ్లు చల్లగా మారిపోతుంటాయి.ఇక జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి.అయితే రక్త హీనత సమస్య ఉన్నా జుట్టు బాగా రాలిపోవడం, బలహీనంగా మారడం జరుగుతంది.
అలాగే రక్త హీనత సమస్య ఉన్న వారు ఏ పనిలోనూ చురుగ్గా పాల్గొనలేరు.ఏకాగ్రత లోపిస్తుంది.
మరియు తరచూ కళ్ళు తిరిగి పడిపోతుంటారు.రక్త హీనత ఉంటే కోపం ఎక్కువగా.
ఆకలి తక్కువగా ఉంటుంది.ఛాతి నొప్పి కూడా రక్త హీతన లక్షణమే.
ఎర్ర రక్త కణాల సంఖ్య లేనప్పుడు ఆక్సిజనేట్ రక్తాన్ని సరఫరా చేయటానికి గుండె అదనపు కృషి చేయాల్సి ఉంటుంది.అందుకే తరచూ ఛాతిలో నొప్పి పుడుతుంది.
ఇక ఏదేమైనా పైన చెప్పిన వాటిలో ఏ లక్షణం కనిపించినా బ్లడ్ టెస్ట్ చేయించుకుని.తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.