సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది నటులు వస్తుంటారు పోతుంటారు.కానీ కొంతమంది ఇక్కడ నిలదుక్కుకుంటారు.
అయితే సక్సెస్ ఏ వయసులో వస్తుంది అని ఎవరు మాత్రం చెప్పగలరు.ప్రస్తుతం చాలామంది నటీనటులు లేటుగా కూడా తమలోని టాలెంట్ ని బయటపెడుతున్నారు.
ప్రేక్షకులు కూడా ఏ వయసు వారినైనా కూడా బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు.అయితే ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటి అంటే పత్తిపాటి అజయ్ ఘోష్.
దాదాపు 60 ఏళ్ల వయసున్న ఈ నటుడు సోలోగా ఒక సినిమాను నిలబెట్టే రోజు వస్తుందని ఏ రోజు అనుకొని ఉండడు.తాజాగా తను నటించినా మ్యూజిక్ షాప్ మూర్తి( Music Shop Murthy ) అనే సినిమా విడుదల అయింది.
సినిమా అయితే మంచి అప్లాజ్ దక్కించుకుంది.దానిలో ఆయన నటన ఖచ్చితంగా హైలెట్ అని చెప్పుకోవచ్చు.
ఇప్పుడు అజయ్ గోష్( Ajay Ghosh ) గురించి చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే ఆయన వయసు 60 ఏళ్లు అని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం.ఈ వయసులో ఒక కమీడియన్ రోల్ లో( Comedian Role ) సినిమాని నిలబెట్టడం అంటే అంత ఈజీ కాదు.ఎందుకంటే ఇప్పుడు వస్తున్న కామెడీని చూడడానికి ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.కొత్తదనం ఉంటే తప్ప ఎవరు ఏ సినిమాని ఒప్పుకోని రోజులు ఇవి.ఇలాంటి ఒక టైం లో అజయ్ గోష్ మ్యూజిక్ షాప్ మూర్తి అనే ఒక సినిమా తీసి ప్రేక్షకులను కన్విన్స్ చేయడం అనే విషయం సాధారణమైన విషయం అయితే కాదు.ఆయన తన నటనతో ఈ సినిమాని నిలబెట్టాడు.
మూర్తి పాత్రలో చక్కగా ఒదిగిపోయి నటించాడు.అయితే ఈ వయసులో అతడు ఒక హీరో కి సరి సమానమైన పాత్ర పోషించి అందరి చేత శభాష్ అనిపించుకోవడమే కోసమేరుపు.
ఇకపై అజయ్ ని అందరు మూర్తి గారు అని పిలిచినా ఆశ్చర్య పోనవసరం లేదు.
ఎన్నో సినిమాల్లో నటించిన ఆయనకు రావాల్సిన గుర్తింపు రాలేదు.2010లో ప్రస్థానం సినిమా తో( Prasthanam Movie ) ఆయన నటుడు అయ్యాడు.ఈ 15 ఏళ్లలో ఎన్నో సినిమాల్లో నటించాడు.తమిళ్, కన్నడ భాషల్లో కూడా కొన్ని సినిమాల్లో నటించాడు.2021 సైమ అవార్డ్స్ లో బెస్ట్ కమెడియన్ గా రాజు గారి గది 3 సినిమాకి అవార్డు కూడా అందుకున్నాడు.అయితే టాలీవుడ్ లో అజయ్ ఘోష్ మాత్రమే కాదు.చాలామంది అండర్ రేటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు.తమకంటూ ఒకరోజు అవకాశం ఇస్తే ఖచ్చితంగా తమను తాము నిరూపించుకోగలరు.ఈ అవకాశం అజయ్ ఘోష్ కి మ్యూజిక్ షాప్ మూర్తి ద్వారా ఖచ్చితంగా వచ్చింది అని చెప్పుకోవచ్చు.