ఢిల్లీ లో జగన్ ధర్నా నేడే .. బిజెపి పెద్దలు కరుణిస్తారా ? 

ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలను టార్గెట్ చేసుకుంటూ అనేక దాడులు చోటు చేసుకోవడం , అనేకమంది వైసిపి కార్యకర్తలు హత్యకు గురవడం,  కేసులు నమోదవడం వంటి పరిణామాలను వైసీపీ అధినేత జగన్( YS Jagan ) సీరియస్ గానే తీసుకున్నారు.హత్యకు గురైన పార్టీ కార్యకర్తలను స్వయంగా వెళ్లి పరామర్శించడంతో పాటు,  ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ కార్యకర్తలలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తూ వచ్చారు .

 Will Bjp Support Jagan Dharna In Delhi Details, Bjp, Ysrcp, Telugudesam, Pawan K-TeluguStop.com

అయినా ఈ హత్యలు , కేసుల వ్యవహారం కు పుల్ స్టాప్ పడకపోవడంతో,  దేశవ్యాప్తంగా ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పై చర్చ జరగాలని , ఈ విషయంలో కేంద్ర బిజెపి పెద్దలు కలుగజేసుకునే విధంగా చేసేందుకు వ్యూహాత్మకంగా ఢిల్లీలో( Delhi ) ధర్నా కార్యక్రమానికి జగన్ పిలుపునిచ్చారు. 

Telugu Jagan Delhi, Janasenani, Pawan Kalyan, Rasheed, Tdp, Telugudesam, Ysrcp-P

నేడు పార్టీ కీలక నాయకులతో పాటు,  దేశవ్యాప్తంగా వివిధ పార్టీలను ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానాలు పంపించారు.నేడు ఢిల్లీలో ధర్నా కార్యక్రమం ద్వారా ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను హైలెట్ చేయాలని జగన్ భావిస్తున్నారు టిడిపి కూటమి( TDP Alliance ) ప్రభుత్వం ఏర్పడిన 50 రోజుల్లోనే రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని వైసిపి ఆరోపిస్తోంది.ఏపీలో శాంతిభద్రతలు లేవనే విషయాన్ని దేశం దృష్టికి తీసుకు వెళ్ళేందుకు ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో( Jantar Mantar ) పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు , ముఖ్య నాయకులతో కలిసి జగన్ ధర్నా నిర్వహించనున్నారు.

Telugu Jagan Delhi, Janasenani, Pawan Kalyan, Rasheed, Tdp, Telugudesam, Ysrcp-P

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు.  టిడిపి కూటమి ప్రభుత్వం చేసిన దారుణకాండ పై కలిసివచ్చే పార్టీలన్నిటితో కలిసి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.అలాగే ఏపీలో శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదికి( PM Narendra Modi ) జగన్ లేఖ రాశారు.  వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఇప్పటికే పరామర్శించారు.

గవర్నర్ అబ్దుల్ నజీర్ ను  కూడా కలిసి రాష్ట్రంలో విధ్వంస కాండపై ఫిర్యాదు చేశారు.నేటి ధర్నాతో ఏపీలో పరిస్థితులు మారుతాయని , వైసిపి నాయకులే టార్గెట్ గా చేస్తున్న దాడులకు అడ్డుకట్టపడే విధంగా కేంద్ర బిజెపి పెద్దలు కలుగజేసుకుంటారనే ఆశాభావంతో జగన్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube