ఇటీవల కాలంలో స్టూడెంట్ల ఫైటింగ్( Students Fighting ) వీడియోలు తరచుగా వైరల్ అవుతున్నాయి.అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా అందరూ చూస్తుండగానే కొంచెం కూడా సిగ్గు పడకుండా జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు.
వీళ్లు రౌడీల్లాగా బిహేవ్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు.తాజాగా నోయిడాలోని( Noida ) అమిటీ యూనివర్సిటీ( Amity University ) క్యాంటీన్ లో ఇద్దరు అమ్మాయిలు దారుణంగా కొట్టేసుకున్నారు.
వీరి కొట్లాటకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో, ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు తిట్టుకుంటూ, నెట్టుకుంటూ, జుట్టు పట్టుకుంటూ కనిపిస్తున్నారు.
ఈ ఘటన చాలా భయంకరంగా ఉంది.
ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియ రాలేదు.
ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ అయింది, ఈ గొడవకు కారణం ఏమిటి అనే విషయం కూడా ఇంకా తెలియ రాలేదు.అయితే, ఈ వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
సోషల్ మీడియా యూజర్లలో దీనిపై ఓ చర్చ కూడా జరుగుతోంది.చాలా మంది ఈ ఘటనను ఖండిస్తూ, ఇలాంటి సంఘటనలు విద్యాసంస్థలలో జరగకూడదని అభిప్రాయపడుతున్నారు.
ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 125లో ఉన్న అమిటీ యూనివర్సిటీ క్యాంటీన్లో( Amity University Canteen ) జరిగింది.30 సెకన్ల వీడియోలో, ఇద్దరు అమ్మాయిల మధ్య మొదట ఒకరిపై ఒకరు అరుచుకుంటారు.ఆ తర్వాత ఒకరినొకరు నెట్టుకుంటూ, చొక్కాలు పట్టుకుని కొట్టుకోవడం ప్రారంభిస్తారు.చివరగా ఒక టేబుల్ మీద పడి ఒకరినొకరు గుద్దుకుంటారు.వీరి బరువుకి టేబుల్ కూడా విరిగిపోతుంది.
వీడియోలో, ఫైటింగ్ మొదలైనప్పుడు వారిని ఆపడానికి ఒక అమ్మాయి ( Girls ) ప్రయత్నించినా, వారు ఆమె మాట వినకుండా అలానే కొట్లాడుకుంటారు.మిగిలిన విద్యార్థులు పోరాటాన్ని ఆనందించి, చప్పట్లు కొడుతూ ఉంటారు.వారు జోక్యం చేసుకోకుండా, వీడియో తీయడం మొదలుపెడతారు.విద్యార్థులు బిగ్గరగా నవ్వుతూ, చప్పట్లు కొడుతూ ఉంటారు.“ఓయ్, టేబుల్ విరిగిపోయింది ” అని కూడా అరుస్తారు.విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.ఈ అమ్మాయిలను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.