ఏందయ్యా ఇది.. కొకెయిన్‌కు తినేస్తున్న సొరచేపలు.. సైంటిస్టులు షాక్??

ఈ భూ ప్రపంచంపై ఉన్న సముద్రాలన్నీ కూడా మానవులు చేసే పనుల వల్ల సిద్ధం అవుతున్నాయి దీనివల్ల సముద్రంలో జీవించే జీవులు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నాయి.తాజాగా బ్రెజిల్‌లోని( Brazil ) సముద్రాల్లో షార్క్‌లు కోకెయిన్( Cocaine ) వంటి మాదకద్రవ్యాలకు అడిక్ట్ అయ్యాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

 Sharks In Brazil Are Testing Positive For Cocaine Says Scientists Detials, Shark-TeluguStop.com

మురికినీటి శుద్ధి కర్మాగారాల నుంచి లీకైన నీటి ద్వారా లేదా సముద్రంలో మునిగిపోయిన డ్రగ్స్ ప్యాకెట్లను తినడం ద్వారా షార్క్‌లు( Sharks ) కోకెయిన్‌ను తీసుకుంటాయి.బ్రెజిల్‌లోని ఒస్వాల్డో క్రూజ్ ఫౌండేషన్ శాస్త్రవేత్తలు రియో డి జనీరో సమీపంలోని తీరప్రాంత జలాల్లో పట్టుకున్న 13 సొర చేపల కండరాలు, కాలేయాలలో డ్రగ్స్ అవశేషాలను కనుగొన్నారు.

Telugu Brazil, Brazil Sharks, Cocaine, Durgs, Leaky Sewage, Nri, Oceans, Sharks,

ఈ షార్క్‌లు చాలా చిన్నవి, కేవలం మూడు అడుగుల పొడవు ఉంటాయి.వీటి ఆహారం చిన్న చేపలు, స్క్విడ్‌లు.ఈ షార్క్‌లను పట్టుకుని శాస్త్రవేత్తలు( Scientists ) వాటి కాలేయం, కండరాల నుంచి నమూనాలు తీసుకున్నారు.ఆ నమూనాలను పరీక్షించగా అన్నింటిలోనూ కోకెయిన్ ఉన్నట్లు తేలింది.మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 13 షార్క్‌లలో 12 షార్క్‌ల శరీరంలో విచ్ఛిన్నమైన కోకెయిన్ పదార్థం కూడా ఉంది.అంతేకాదు, ఈ షార్క్‌ల శరీరంలోని కోకెయిన్ మోతాదు ఇతర సముద్ర జీవుల కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంది.

Telugu Brazil, Brazil Sharks, Cocaine, Durgs, Leaky Sewage, Nri, Oceans, Sharks,

ఈ అధ్యయనం బ్రెజిల్‌లోని ఒక రకమైన షార్క్‌లపైనే జరిగింది.కానీ ఇతర రకాల షార్క్‌లకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది.అంతేకాదు, అధికంగా చేపల వేట జరగడం వల్ల చాలా రకాల షార్క్‌లు అంతరించిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.షార్క్‌లు కోకెయిన్ తీసుకోవడం వల్ల వాటి ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాలు సంభవించవచ్చు.

కోకెయిన్ షార్క్‌ల DNAను దెబ్బతీస్తుంది, దీనివల్ల వ్యాధులకు గురయ్యే అవకాశం పెరుగుతుంది.కోకెయిన్ షార్క్‌ల కొవ్వు మెటబాలిజంను దెబ్బతీస్తుంది, దీనివల్ల వాటికి శక్తి సమస్యలు ఏర్పడవచ్చు.

కోకెయిన్ షార్క్‌ల ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది, దీనివల్ల వేటాడటం, శత్రువుల నుంచి తప్పించుకోవడం వంటి వాటికి ఇబ్బంది అవుతుంది.ఈ ప్రవర్తన మార్పులు షార్క్‌ల మనుగడకు ముప్పు కలిగిస్తాయి, కానీ అవి ప్రాణాంతకం కావు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube