జనసేనలోకి వైసిపి సీనియర్లు ..? ఎవరెవరంటే ?

ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందిన వైసిపికి( YCP ) కష్టాలు మొదలయ్యాయి .ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేసి టిడిపి , జనసేన లలో చేరిపోతున్నారు.

 Will These Ycp Party Senior Leaders Join Janasena Party Details, Ysrcp, Telugude-TeluguStop.com

ఈ వలసలకు బ్రేక్ వేసేందుకు వైసిపి అధినేత జగన్( YS Jagan ) ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా,  అవేమి ఫలించడం లేదు.  ప్రస్తుతం జగన్ జనాల్లోకి వస్తూ పార్టీ నాయకుల్లో ఉత్సాహం పెంచే ప్రయత్నం చేయడంతో పాటు,  టిడిపి కూటమి ప్రభుత్వం పై విమర్శలతో జగన్ విరుచుకుపడుతున్నారు.

  నేడు ఢిల్లీలో ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు .ఈ వ్యవహారాలు ఇలా ఉండగానే పార్టీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది.  గుంటూరు నగర వైసిపి అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి( Maddala Giri ) ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు.  మరో కీలక  నేత వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు.

గుంటూరు జిల్లాలో కీలక నేతలంతా ఒక్కొక్కరుగా వైసీపీకి రాజీనామా చేసినందుకు సిద్ధమవుతున్నారు.

Telugu Janasena, Kilaru Rosayya, Maddali Giri, Pavan Kalyan, Ravelakishore, Telu

2019లో గుంటూరు జిల్లాలో 15 స్థానాల్లో గెలిచిన వైసిపి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడం , నియోజకవర్గాలను మార్చడం వంటి ప్రయోగాలు చేపట్టడం , అవి విఫలం కావడంతో ఎన్నికల ఫలితాలు నిరాశను కలిగించాయి.ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల్లోనే మాజీమంత్రి రావెల కిషోర్ బాబు( Ravela Kishore Babu ) పార్టీకి రాజీనామా చేశారు .2019 ఎన్నికల్లో టిడిపి నుంచి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలగిరి తర్వాత వైసిపికి దగ్గరయ్యారు.  మొన్నటి ఎన్నికల్లో మాజీ మంత్రి విడుదల రజిని కోసం తన సీటు త్యాగం చేసిన మద్దలగిరి తాజాగా వైసిపికి రాజీనామా చేశారు.

ఆయన టిడిపిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Telugu Janasena, Kilaru Rosayya, Maddali Giri, Pavan Kalyan, Ravelakishore, Telu

అలాగే ఇదే జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోశయ్య( Kilari Rosaiah ) పార్టీ మారే ఆలోచనలో ఉన్నారట .2019లో పొన్నూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా రోశయ్య గెలిచారు.తాజా ఎన్నికల్లో ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణ ను ముందుగా గుంటూరు ఎంపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు.

ఆ తర్వాత రోశయ్య ను  గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీకి దించారు.ఆ ఎన్నికల్లో రోశయ్య ఓటమి చెందారు .ఈ నేపథ్యంలోనే  ఆయన వైసీపీ కి రాజీనామా చేసేందుకు  సిద్ధమైనట్లు సమాచారం.ఈ మేరకు తమ మద్దతుదారులు,  ఆత్మీయులతో సమావేశాన్ని నిర్వహించి,  వారి అభిప్రాయాల మేరకు జనసేన లో( Janasena ) చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube