1.ఎన్నికలు ఆపాలని టిఆర్ఎస్ కుట్ర పన్నుతోంది
ఇండిపెండెంట్ లకు సంబంధించిన ఎనిమిది గుర్తులను రద్దు చేయాలని టిఆర్ఎస్ పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేయడంపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.టిఆర్ఎస్ మునుగోడు ఎన్నికలను ఆపాలని కుట్ర చేస్తోందని సంజయ్ విమర్శించారు.
2.కోమటిరెడ్డి ఆశీస్సులు నాకే : కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థి
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న తనకి కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులు ఉంటాయని పాల్వాయి స్రవంతి అన్నారు.
3.కేటీఆర్ కు కిషన్ రెడ్డి కౌంటర్
ప్రధాని నరేంద్ర మోడీకి ఆస్కార్ అవార్డు ఇప్పించాలంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేయడంపై కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.కేసీఆర్ కే నోబెల్ బహుమతి ఇప్పంచాలని కిషన్ రెడ్డి అన్నారు.
4.టైప్ రైడింగ్ షార్ట్ హ్యాండ్ నోటిఫికేషన్ విడుదల
టైప్ రైడింగ్, షార్ట్ హ్యాండ్ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల అయింది.
5.25న యాదాద్రి గుట్ట ఆలయం మూసివేత
ఈనెల 25 న సూర్యగ్రహణం కారణంగా శ్రీ బాలాజీ టెంపుల్ ను పాక్షికంగా మూసివేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.
6.తెలంగాణలోనూ పోటీ చేస్తాం
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
7.బల్కంపేట ఎల్లమ్మ ఆలయం హుండీల లెక్కింపు
బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో సోమవారం 69 రోజులకు సంబంధించిన 18 హుండీల ద్వారా మొత్తం 64.86 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు.
8.21 నుంచి ఎంసెట్ తుది కౌన్సిలింగ్
ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్ ఈనెల 21 నుంచి ప్రారంభం కానుంది.అభ్యర్థులు 21న స్లాట్లను నమోదు చేసుకోవాలి.
9.టిఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీ
టిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ ద్రోహులు పార్టీగా మారితే బిజెపి తెలంగాణ ఉద్యమకారులకు వేదికైందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
10.పవన్ పై పేర్ని నాని విమర్శలు
మాజీ మంత్రి వైసిపి ఎమ్మెల్యే పేర్ని నాని పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు.అన్ని స్థానాల్లోనూ జనసేన పోటీ చేస్తే ప్యాకేజీ స్టార్ అనే తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామని పేర్ని నాని అన్నారు.
11.చంద్రబాబు పవన్ భేటీ
విజయవాడ నోవాటెల్ హోటల్ లో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు.
12.అమరావతిపై సుప్రీం లో విచారణ ప్రారంభం
ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్ లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభమైంది.మంగళవారం సిజేఐ జస్టిస్ లలిత్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది.
13.జగన్ పై నాగబాబు కామెంట్స్
అవినీతికి కేరాఫ్ అడ్రస్ జగన్ రెడ్డి ఉన్నారని జనసేన కీలక నాయకుడు పవన్ సోదరుడు నాగబాబు విమర్శించారు.
14.పవన్ పై అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు చేశారు.
వైసీపీ ప్రభుత్వాన్ని పీకే సత్తా నీకు లేదని తెలుసుకో పీకే.పీకే నువ్వు ఏమి పీకలేవు నువ్వు చంద్రబాబు దత్తపుత్రుడువి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.చంద్రబాబు యాక్షన్ అనగానే ఓ ప్రెస్ మీట్ పెట్టడం అలవాటే అంటూ అనిల్ విమర్శించారు.
15.న్యాయవాదులతో పవన్ కళ్యాణ్ భేటీ
మంగళగిరి పార్టీ కార్యాలయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు.న్యాయవాదులతో పవన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
16.బిగ్ సి అధినేత ఇంట్లో ఐటీ సోదాలు
విజయవాడ నగరంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.మంగళవారం బిగ్ సి అధినేత ఏనుగు సాంబశివరావు ఇంటిలో తనిఖీలు చేపట్టారు.
17.కొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు
ఏపీలో కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలు సమీకృత కలెక్టరేట్ లను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
18.దుర్గమ్మ ఆదాయం 16 కోట్లు
దసరా ఉత్సవాలు విజయవాడ దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆదాయం 16 కోట్లు వచ్చిందని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు.
19.తరుణ్ ఛుగ్ తో బూర నరసయ్య గౌడ్ భేటీ
తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇన్చార్జి తో టిఆర్ఎస్ మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ భేటీ అయ్యారు.
20.గల్ఫ్ లో మోహన్ లాల్ సినిమాపై బ్యాన్
మళయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన ‘ మాన్ స్టర్ సినిమా పై గల్ఫ్ లో నిషేదం విధించారు.