సాధారణంగా చాలా ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులు లేదా బంధువులను కలుస్తుంటే అందరికీ చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఇటీవల కాలంలో భారతీయులు విదేశీయులను పెళ్లి చేసుకోవడం కామన్ అయిపోయింది.
అయితే ఉద్యోగరీత్యా వేర్వేరుగా నివసించాల్సి వస్తుంది.అయితే మన భారతీయులు తమ విదేశీ అత్తమామల ఇంటికి వెళ్లినప్పుడు వారు ఎంతో సంతోషిస్తున్నారు.
ఘనంగా స్వాగతిస్తున్నారు కూడా.రష్యన్ అమ్మాయిని( Russian Woman ) పెళ్లి చేసుకున్న భారతీయుడికి సరిగ్గా ఇలాంటి గ్రాండ్ వెల్కమ్ లభించింది.
ఒక భారతీయ వ్యక్తి( Indian Man ) 3 ఏళ్ల తర్వాత తన అత్తమామలను కలవడానికి రష్యా వెళ్లాడు.దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో, భారతీయ వ్యక్తి తన భార్యతో కలిసి విమానంలో రష్యాకు ప్రయాణించడం, విమానాశ్రయంలో( Airport ) దిగడం కనిపించింది.అక్కడ అతనికి అత్త, మామ స్వాగతం పలుకుతారు.
అయితే, భార్య సోదరి అతనికి ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తుంది, ఇది చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది.
ఈ వీడియోలో సంస్కృతుల మిళితం, రెండు కుటుంబాల మధ్య ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది.అక్క భర్తను ఆశ్చర్యపరచడానికి, మరదలు అన్నె డ్రాగన్ దుస్తులను ధరించి వారిని స్వాగతిస్తుంది.దీనిని చూసి భార్యాభర్తలు ఆశ్చర్యపోతారు.
ఆ తర్వాత సంతోషంగా ఫీల్ అవుతారు.ఆపై, ఇంటికి చేరుకున్నప్పుడు, అత్త తన కూతురు, అల్లుడిని ఆప్యాయంగా కౌగిలించుకుంటుంది.
తన భర్తను తన తల్లిదండ్రులు కొడుకులా చూసుకుంటున్నారని ఆ మహిళ వీడియోలో చెబుతుంది.భారతదేశానికి తిరిగి వెళ్లే ముందు తన భర్తతో రష్యాలో( Russia ) హాయిగా సమయాన్ని గడపాలని ఆమె ఆశిస్తుంది.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.“మాస్కో, రష్యాలో నా కుటుంబంతో ఎలా గడుపుతున్నామో చూడండి” అనే క్యాప్షన్‌తో ఆ మహిళ ఈ వీడియోను పోస్ట్ చేసింది.ఈ వీడియోకు ఇప్పటివరకు 46.4 వేల మందికి పైగా లైక్స్ వచ్చాయి.చాలా మంది వీడియోపై వ్యాఖ్యలు చేసి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.ఒక వ్యక్తి వీడియోను చాలాసార్లు చూశానని, డైనోసార్ కాస్ట్యూమ్( Dinosaur Costume ) దారించింది ఎవరో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూశానని రాశారు.
చివరికి అది ఆమె సోదరి అని తెలిసి ఆశ్చర్యపోయానని అన్నారు.మరొక వ్యక్తి ఈ వీడియో చాలా నచ్చిందని, ఒకరికొకరు సంస్కృతులను అభినందించుకునే విధానం చాలా బాగుందని వ్యాఖ్యానించారు.