2022: ఈ ఏడాది ఒక్క సినిమా కూడా విడుదల చేయని హీరోలు

గతంలో ఒక ఏడాదిలో వందల కొద్ది సినిమాలు బాక్సాఫీస్ ని టచ్ చేసేవి.అలాగే ఒక హీరో తన కెరియర్లో డజన్ కి పైగా సినిమాలని అలవోకగా తీసేవారు.

 Tollywood Heros Movies In 2022 , Balakrishna, Akhil, Allu Arjun, Sai Dharam Tej,-TeluguStop.com

ఎక్కువలోకి ఎక్కువ కృష్ణ ఒక ఏడాదిలో 18 సినిమాలు హీరోగా నటించాడు.ఇక రాను రాను సినిమా నిర్మాణం, వాటి విలువలు మారిపోవడంతో ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవడం కష్టంగా మారింది.

ఇప్పుడు ఒక్కో సినిమా కోసం గ్రాఫిక్స్ వల్ల ఏళ్లకు ఏళ్ల సమయం తీసుకుంటున్నారు.దాదాపు నాలుగు నుంచి ఐదు ఏళ్ల పాటు నిర్మాణం జరుపుకుంటున్న సినిమాలు మనం చూస్తూనే ఉన్నాం.

ఇక 2022 రెండవ సంవత్సరం ముగింపు దశకు వచ్చింది.అయితే ఈ ఏడాదిలో ఒక్క సినిమా కూడా తీయని హీరోలు ఉన్నారు.

అలాగే ఒకటికి మించి సినిమాల్లో కనిపించిన హీరోలు కూడా ఉన్నారు.

చిరంజీవి తన కెరియర్లో చాలా స్పీడ్ గా ముందుకు పోతున్నాడు.

ఏప్రిల్ లో ఆచార్య సినిమా అలాగే దసరాకి గాడ్ ఫాదర్ సినిమాతో 2022 ముగించాడు.సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో రానున్నాడు.

దీన్ని బట్టి చూస్తే కేవలం 10 నెలల సమయంలోనే మూడు సినిమాలు విడుదల చేస్తున్నాడు చిరంజీవి.రామారావు ఆన్ డ్యూటీ, కిలాడి, ధమాకా సినిమాలతో 2022 ని చితకొట్టాడు రవి తేజ.ఇక వెంకటేష్ సైతం ఎఫ్ 3, ఓరి దేవుడా సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు.నాగార్జున సైతం ది గోస్ట్ చిత్రాన్ని విడుదల చేసి 2022 ముగించాడు.

Telugu @republic, Akhanda, Akhil, Allu Arjun, Balakrishna, Pushpa, Sai Dharam Te

ఇక బాలకృష్ణ అఖండ సినిమా విజయం సాధించిన తర్వాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాడు.ఇదే దోవలో అల్లు అర్జున్ సైతం మరొక సినిమాను విడుదల చేయలేకపోయాడు.పుష్ప సినిమా 360 కోట్ల రూపాయలను వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన తర్వాత పుష్ప సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అది వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయ్యింది.ఇక 2022లో అక్కినేని కుటుంబం నుంచి అఖిల్ సైతం తెరపై కనిపించలేదు.

కెరియర్ లోనే ఏకైక హిట్టుగా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ 2021 వ సంవత్సరంలో విడుదలైంది ఆ తర్వాత ఏజెంట్ చిత్రం విడుదల కాక వాయిదా పడింది.ఇక సాయిధరమ్ తేజ సైతం రిపబ్లిక్ చిత్రం తర్వాత మరే సినిమాలోని నటించలేదు.

అతడికి జరిగిన ప్రమాదం కారణంగా ఏడాది పాటు విశ్రాంతి తీసుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube