వీడియో వైరల్: సెక్యూరిటీ గార్డ్​గా పిల్లి.. కథ మాములుగా లేదుగా..

పట్టణాల్లో, నగరాల్లో షాపింగ్ మాల్ లేదా ఏదైనా పెద్ద ఆఫీసులకు, రెస్టారెంట్స్ వెళ్ళినప్పుడు అక్కడ మనం ముందుగా సెక్యూరిటీ గార్డులను( Security Guards ) చూస్తూనే ఉంటాము.సెక్యూరిటీ వారు బిల్డింగ్ లోపలికి వెళ్లేందుకు బిల్డింగ్ బయటికి వచ్చేటప్పుడు కచ్చితంగా తనిఖీ చేసి పంపించడం వారి బాధ్యత.

 Meet Conan The Street Cat Turned Security Officer Video Viral Details, Cat,conan-TeluguStop.com

కేవలం మనుషులు మాత్రమే కాకుండా అక్కడక్కడ కొన్ని పెద్ద షాపింగ్ మాల్స్ లో సెక్యూరిటీ డాగ్స్ కూడా ఉండడం చాలా తక్కువ మంది చూసి ఉంటారు.ఎవరైనా ఒక్కోసారి సెక్యూరిటీ గార్డ్స్ కళ్ళు కప్పి ఏదైనా వస్తువును తీసుకెళ్లడం లాంటి సంఘటనలను కుక్కలు పసి గట్టేస్తాయి కాబట్టి.

అయితే ఇప్పుడు ఓ షాపింగ్ మాల్లో పిల్లి( Cat ) సెక్యూరిటీ గార్డ్ గా ఉద్యోగం చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది.అవునండి పిల్లి ఏంటి.

సెక్యూరిటీ గార్డ్ గా పనిచేయడం ఎందని అనుకుంటున్నారా.? నిజమేనండి.! అయితే ఇది భారతదేశంలో కాదు.ఫిలిప్పీన్స్ దేశంలో.( Philippines ) ఓ మాల్ లో పిల్లి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంది.ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో.

ఓ మాల్లో పిల్లికి సెక్యూరిటీ గార్డ్ గా చేస్తున్న వీడియో కనబడుతుంది.ఈ మాల్ లో పిల్లి సెక్యూరిటీ సిబ్బందితో సమానంగా విధులు నిర్వహిస్తోంది.ఒకవేళ ఎవరైనా సెక్యూరిటీ కార్డు మనుషులు నిర్లక్ష్యం వహిస్తారేమో.

కానీ పిల్లి మాత్రం సెక్యూరిటీ గార్డ్ విషయంలో మాత్రం అస్సలు అలసత్వం వహించదు.ఈ పిల్లి మాండలుయుంగ్ మెట్రో మనీలాలోని మాల్ లో మెగా వరల్డ్ కార్పొరేట్ సెంటర్లో( Mega World Corporate Center ) సెక్యూరిటీ జాబ్ చేస్తోంది.

రోజు మొత్తం గేటు వద్దనే ఉండి సెక్యూరిటీ డ్యూటీ చేస్తుంది ఈ పిల్లి.దీని పేరు చెప్పలేదు కదా.పిల్లి పేరు కోనన్.( Conan ) ఈ పిల్లి మాల్లోకి వచ్చే సమయంలో ప్రజల బ్యాగులను తనిఖీ చేయడంలో సెక్యూరిటీ సిబ్బందికి సహాయపడుతుంది.ఇదే కాదండోయ్.మాల్ కి ఏవైనా జంతువులను ప్రజలు తీసుకువచ్చినప్పుడు వాటికి కూడా స్వాగతం పలుకుతుంది.ఇకపోతే ఈ పిల్లి వయసు కేవలం ఆరు నెలలు మాత్రమే.పిల్లి కేవలం తాను చేసే పనికి మాత్రమే కాకుండా అక్కడ పనిచేసే సెక్యూరిటీ సిబ్బందికి ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఈ పిల్లి ఎంతగానో ఉపయోగపడుతుందంటూ అక్కడ సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు.

ఇక ఈ పిల్లి చేస్తున్న పనిని చూసి కొందరు మా పిల్లిని కూడా పనిలో పెట్టుకోవాలంటూ అక్కడ అడిగారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube