కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల తో రాఖీ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్పూర్ గ్రామం కేజీబీవీ పాఠశాలలో గురువారం జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ చాంద్ పాషా ఆధ్వర్యంలో ఘనంగా విద్యార్థుల మధ్య రాఖీ వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ పిల్లి రేణుక( Renuka ), మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెండే శ్రీనివాస యాదవ్ లు మాట్లాడుతూ కేజీబీవీ పాఠశాలలో దూర ప్రాంతాలలో నివాసముంటున్న నిరుపేద విద్యార్థులు రాఖీ పండుగకు ఇంటికి వెళ్లలేదని తెలుసుకున్న జిల్లా కోఆప్షన్ సభ్యులు చాంద్ పాషా తన సొంత ఖర్చులతో రాఖీలు, మిఠాయిలు కొనుగోలు చేసి పాఠశాలకు రావడం జరిగింది.

 Rakhi Celebrations With Students At Kgbv School-TeluguStop.com

విద్యార్థులతో రాఖీ వేడుకలు( Rakhi Celebrations ) జరుపుకుంటున్నామని మాకు సమాచారం అందగానే పాఠశాలకు రావడం జరిగిందన్నారు.విద్యార్థులు ఎంతో సంతోషంతో రాఖీలు కట్టి సంబరాలు జరుపుకున్నారు.

అదేవిధంగా పాఠశాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది ద్వారా రాఖీలు కట్టించుకొని ఆడపడుచులకు కో ఆప్షన్ సభ్యులు కొంత నగదును అందించడం అభినందనీయమన్నారు.ఈ సందర్భంగా చాంద్ పాషా మాట్లాడుతూ కేజీబీవీలో అధిక శాతం గిరిజనులు, దళితులు, నిరుపేదలు విద్యను అభ్యసిస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు గురుకుల పాఠశాలలో ఉచిత విద్యను అందిస్తూ వారు నిరుపేదలు కారని మేమున్నామని అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారికి విద్యను అందించడం జరుగుతుందన్నారు.దూర ప్రాంతాలలో నివసిస్తున్న వారు రాఖీ పండుగకు వెళ్లలేదని తెలియడంతో వారి మధ్యలో పండగను జరుపుకోవడంతో విద్యార్థులు ఆనందo వ్యక్తం చేశారన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ పాఠశాల ద్వారా వారికి అందిస్తున్న విద్య, అన్ని సౌకర్యాలను గుర్తు చేస్తూ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ అధికారిణి అజంతా ఉపాధ్యాయులు శాహెదా పర్వీన్ , సంధ్యా రాణి, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube