రాజన్న సిరిసిల్ల జిల్లా: చీర్లవంచ గ్రామంలో ఏర్పాటు చేయనున్న ఆక్వా హబ్ పెండింగ్ పనులను వెంటనే పరిష్కరిస్తామని ఎన్ ఖీమ్యా నాయక్ తెలిపారు.మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో ఆక్వా హబ్ పెండింగ్, పనుల పై ఫిష్ ఇన్ ఇండియా, టెల్లార్ , రాజన్న ఆక్వా ప్రతినిధులు జిల్లా అదనపు కలెక్టర్ తో చర్చించారు.
ఈ సందర్భంగా ప్రతినిదులు తమ పెండింగ్ పనులు, సందేహాలను , క్షేత్ర ఇబ్బందులను జిల్లా అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఆక్వా హబ్ కు సంబంధించి భూ సేకరణ, ఎలక్ట్రిసిటీ, ఇతర అన్ని పెండింగ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతినిధులకు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఆర్డిఓ టి శ్రీనివాసరావు, తంగళ్ళపల్లి తహాసిల్దార్ పిట్టల సదానందం ,ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.