చూడచక్కని అందగాడు మనోజ్ కుమార్ నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా : సంతానం కోసం నమ్ముకున్న దేవుళ్లను కొలిచారు ఆ నిరుపేద గిరిజన దంపతులు. ఆ దంపతులకు చూడ చక్కని అందమైన బాలున్ని జన్మ నిచ్చారు.

 Manoj Kumar Naik Is A Handsome Man Needs Help To Recover, Manoj Kumar Naik , Ner-TeluguStop.com

నమ్ముకున్న ఆ దేవుళ్ళు చూడముచ్చటగా అందంగా ఉన్న ఆ బాలుడు బుడి బుడి అడుగులు వేయడం వినడం మాట్లాడటం తో సంబరపడ్డ ఆ గిరిజన దంపతులు ఆ బాలునికి మనోజ్ కుమార్ నాయక్ గా నామకరణ కూడా చేశారు.ఎల్లారెడ్డిపేట మండలం దేవుని గుట్ట తండాకు చెందిన ఆ నిరుపేద కుటుంబం ఆ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి వరకు చదివించారు.

ఇంటి నుండి పాఠశాల వరకు నడుచుకుంటూ వెళ్ళి మూడో తరగతి వరకు చదువుకున్న మనోజ్ కుమార్ రోజురోజుకు పెరిగిన కొద్దీ నరాల బలహీనత వ్యాధి సోకడంతో పది సంవత్సరాల వయసున్న మనోజ్ కుమార్ నాయక్ ప్రస్తుతం నడవలేని నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నాడు,

మాటలు మాట్లాడటం , వినడం, తినడం అన్ని మంచిగున్నాయి.తండ్రి భూక్య శ్రీనివాస్ నాయక్ ఆటో కార్మికునిగా అతని భార్య లలిత వ్యవసాయ కూలీగా పనిచేస్తుంది.

అప్పులు చేసి తల్లిదండ్రులు ఆ బాలున్ని హైదరాబాద్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వివిధ ఆసుపత్రిలలో నరాల బలహీనత తో బాధపడుతున్న కుమారుడు మనోజ్ కుమార్ నాయక్ ను చూపెట్టిన వ్యాధి నయం కాలేదు.అమెరికా వెళ్ళిన నయం కాదని డాక్టర్లు చెప్పారని శ్రీనివాస్ నాయక్ లలిత ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం వారికి 10 నెలలు ఉన్న పాప బాగానే ఉందని వారు చెబుతున్నారు.దేవుని గుట్ట తండా గ్రామపంచాయతీ కి మంగళవారం వెళ్లిన

బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య కు మనోజ్ కుమార్ నాయక్ వ్యాధి ని నయం చేయించాలని అతని తండ్రి భుక్యా శ్రీనివాస్ నాయక్ , తల్లి లలిత వేడుకున్నారు.

మనోజ్ కుమార్ నాయక్ గురించి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో మాట్లాడి హైదరాబాదులో మెరుగైన వైద్యం అందిస్తామని ఆయన వారికి మనోధైర్యం కల్పించారు.అదేవిధంగా మనోజ్ కుమార్ నాయక్ కు 64 శాతం సదరన్ అర్హత కలిగిన సర్టిఫికెట్ ఉన్నందున వికలాంగుల పెన్షన్ ఇప్పిస్తానని ఆగయ్య వారికి హామీ ఇచ్చారు.

ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్సాని మోహన్ కుమార్ యాదవ్,దేవుని గుట్ట తండా గ్రామపంచాయతీ సర్పంచ్ పెంటయ్య నాయక్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube