రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు కొండూరు రవీందర్ రావు జన్మదిన వేడుకలు స్థానిక సంతోషిమాత వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు.రవీందర్ రావు ఆయురారోగ్యాలతో ఉన్నత పదవులు అధిరోహించాలని సంతోషిమాత ఆలయంలో పూజలు నిర్వహించి వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడిగల మానస రాజు, సిరిసిల్ల ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, సర్పంచులు అంకారపు అనిత రవీందర్, ముడారి పోచయ్య, ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి, వార్డు సభ్యులు క్యారం జగత్ కుమార్, రెడ్డి పరుశరాములు, జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్, మండల బిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు మోర నిర్మల, ఎస్సీ సెల్ మహిళ అధ్యక్షురాలు సద్ద శోభ, బీసీ సెల్ మహిళఅధ్యక్షురాలు కోడం సంధ్యారాణి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి హమీద్, మాజీ మండల యూత్ అధ్యక్షులు నక్క ప్రేమ్ కుమార్, కొక్కిరాల ఆగం రావు, రంగు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
.






