పరి కడుపుతో తులసి ఆకులను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తులసి ఆకు( Basil leaf ) చాలా పవిత్రమైనది.తులసికి భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది.

 Do You Know How Many Health Benefits Of Eating Basil Leaves On An Empty Stomach-TeluguStop.com

హిందూ మతంలో చాలామంది వారి వారి ఇళ్ళలో ప్రతిరోజు తులసి మొక్కను పూజ చేస్తారు.ఎందుకంటే తులసిను లక్ష్మీదేవిలా( Goddess Lakshmi ) కొలుస్తారు.

అయితే తులసికి మతపరంగానే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.తులసి ఒక ఆంటీ బయోటిక్( Antibiotic ) తులసి ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో ప్రతిరోజు ఖాళీ కడుపుతో తులసిని తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు.

ఈ రోజుల్లో చాలామంది మలబద్ధక సమస్యతో( constipation problem ) బాధపడుతున్నారు.అందుకే వాళ్ళు తులసి ఆకులను తింటే ఎంతో మేలు చేస్తాయి.అయితే ఖాళీ కడుపుతో తులసి ఆకులను తినడం వల్ల మలబద్ధకం తొలగిపోతుంది.అదేవిధంగా జీర్ణ క్రియ కూడా బాగా జరుగుతుంది.ఇక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న వాళ్లకు కూడా తులసి ఆకు ఈ సమస్య నుండి బయటపడేందుకు సహాయపడుతుంది.ప్రధానంగా తులసి ఆకులు ఖాళీ కడుపుతో తినడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.

అదే విధంగా తులసి ఆకు ఖాళీ కడుపుతో తింటే గుండె ఆరోగ్యానికి( heart health ) కూడా చాలా మంచిది.ఎందుకంటే తులసిలో ఆంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి.అందువల్ల ఈ తులసిని తరుచుగా తీసుకుంటే గుండె సమస్యలు ఏవి దరికి రావు అలాగే తులసి ఆకులో ఉండే పొటాషియం, ఫోలేట్ ఆరోగ్యానికి చాలా మంచిది.ఇది ఎముకలను బలంగా మార్చుతాయి.

అదేవిధంగా తులసి ఆకులను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల క్యాన్సర్ ను నివారించవచ్చు.అదేవిధంగా ప్రతిరోజు వాతావరణం ప్రకారం వచ్చే జలుబు లాంటి దగ్గు ఇలాంటి చిన్న చిన్న జబ్బులను నయం చేస్తుంది.

అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.దీని వల్ల ఇలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube