రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం( Yellareddypet ) వెంకటాపూర్ గ్రామ శివారులో ఉన్న ఓమౌజయాః ప్రజ్ఞాన క్షేత్రంలో మంగళవారం శ్రీశ్రీశ్రీ పరమ పూజ్య మహా ప్రేమావతార స్వయంభూః ఆదిపరబ్రహ్మ జైమహావిభోశ్రీః వారి దివ్యానుగ్రహ మహిమాన్విత సన్నిధానములో శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది ( sri krodhi nama samvatsaram)వేడుకలను లోక కళ్యాణార్థమై శ్రీ సుదర్శన చండీ చక్ర యజ్ఞం 24 గంటలు నిర్విరామముగా ఓమౌజయాః ఏకోపాసన మహా ధర్మం ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఉదయం 4.00 గంటల నుండి బుధవారము 10వ తేది ఉదయం 4.00 గంటల వరకు ఉంటుందని యజ్ఞం నిర్వాహకులు తెలిపారు.10-04-2024 బుధవారము రోజున ఉదయం పూర్ణాహుతి అనంతరం శ్రీప్రభు వారి అనుగ్రహ ప్రవచనముతో ఉగాది మహోత్సవ వేడుకలు ముగుస్తాయని వివరించారు.ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన అన్నదానం లో వేలాది గా భక్తులు పాల్గొని 22 రకాల అన్నప్రసాదాలు స్వీకరించారు.
ఈ వేడుకల్లో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.