రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలోని శ్రీ పుట్టల మల్లన్న స్వామి వారి కళ్యాణ మహోత్సవ పురస్కరించుకొని మంగళవారం ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( MLA Aadi Srinivas ( స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ నూతన సంవత్సరం ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
నూతన సంవత్సరంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు.అనంతరం గ్రామస్తులు,ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించారు.