రాజన్న సిరిసిల్ల జిల్లా :శ్రీ క్రోది నామ సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని గ్రామ పురోహితులు ఆశీర్వచనాలు అందించారు.ఉగాది పర్వదినం సందర్బంగా సంప్రదాయం ప్రకారం గా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండల కేంద్రంలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం( Shri Sai Baba Temple )లో స్థానిక వైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వివిధ పార్టీల నాయకులు వ్యాపారులు ప్రజలతో కలిసి పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు.
ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ గుండయ్య శర్మ ఆద్వర్యంలో సత్సంగ సదనం లో సత్సంగ సదనం అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సద్ది మద్దుల సంఘం లో రాచర్ల కృష్ణమూర్తి శర్మ , శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం లో ఆలయ పూజారి నవీన్ చారి , రాఛర్ల కృష్ణ మూర్తి శర్మ ఆద్వర్యంలో శ్రీ మార్కండేయ మందిరంలో ఆలయ పూజారి ఉమాశంకర్ ఆద్వర్యంలో ఉగాది పర్వదినం( Ugadi ) సందర్భంగా పంచాంగ శ్రవణం చేసి ఆనందంగా జరుపుకున్నారు.అనంతరం భక్తులకు ఉగాది పచ్చడి తో పాటు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయకమీటీ ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్, బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు,బండారి బాల్ రెడ్డి, ఓగ్గు బాలరాజు యాదవ్, వంగ గిరిధర్ రెడ్డి, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, మెగి నర్సయ్య, దీటీ నర్సయ్య , గోదాగోష్టి మహిళా భక్త బృందం, గ్రామస్తులు పాల్గొన్నారు.ఆలయ అర్చకులు నవీన్ చారి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.