గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి.ప్రతి కేసులో నైపుణ్యంతో కూడి దర్యాప్తు కొనసాగించాలి.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రాజాన్న సిరిసిల్ల జిల్లా :రాబోవు ఎన్నికల నిర్వహణకు,గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ యంత్రంగా సన్నద్ధంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) అధికారులకు సూచించారు.గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించరు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగులో ఉన్న కేసులను సత్వరమే పరిష్కారానికి కృషి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.అధికారులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ, నైపుణ్యంతో కూడి దర్యాప్తు కొనసాగించాలని, నేరస్తులకు శిక్ష పడేందుకు దర్యాప్తు అధికారులు ఖచ్చితమైన సాక్ష్యాధారాలను అందజేయాలని తెలిపారు.
తరచు అసాంఘిక కార్యకలపాలకు,నేరాలకు పాల్పడుతు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని గుర్తించి వారిపై పిడి యాక్ట్ అమలు చేయాలని అన్నారు.రాబోవు ఎన్నికల సందర్భంగా జిల్లాలోని పోలీస్ అధికారులకు సిబ్బందికి ఎన్నికల నియవళి మీద వారికి గలా పలు సందేశాలు నివృత్తం చేయడానికి ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
ఎన్నికల నిర్వహణకు పోలీస్ అధికారులు సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని, ఎన్నికలకు సంబంధించి పోలీస్ అధికారులకు ,సిబ్బందికి ఎన్నికల నియమావళి పట్ల అవగాహనా కలిగి ఉండాలని,ప్రతి ఎన్నికల్లో కొత్త సవాళ్లు ఎదురవుతాయని ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని జిల్లాలో ఆరు చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు.క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు,వల్నరబుల్ పోలింగ్ ప్రాంతాలు గుర్తింపు పట్ల స్పష్టత ఉండాలని, ఎన్నికల నిర్వహణలో నామినేషన్ దాఖలు, ప్రచారం, పోలింగ్ రోజు వరకు తదితర అంశాలపై చేపట్టే ప్రణాళికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమస్యత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతల పర్యవేక్షణ,పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఎన్నికల సందర్భంగా నేర చరిత్ర ఉన్నవారు ,రౌడీ షీటర్లు, ఎన్నికలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి జాబితా సిద్ధం చేసి వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారిని సంబంధిత అధికారులు ముందు బైండోవర్ చేయాలని, డబ్బు, మద్యం, గంజాయి,గుడుంబా రవాణాతో పాటు బెల్ట్ షాపులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.జిలాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి గణేష్ మండపంను జియో ట్యాగింగ్ చేయలని సూచించారు.
నిమజ్జన ఊరేగింపుగా వెళ్లే సమయాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా రూట్ మ్యాప్ లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.గణేష్ మండపాలను అధికారులు బ్లూ కోల్ట్ సిబ్బంది తరచు తనిఖీ చేస్తూ ఉండాలని అన్నారు.
మత్తు పదార్ధాలకు, డగ్స్ వంటి వాటికి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్న వారిని వాటికి దూరం చేసి సన్మార్గంలో నడిపించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ విముక్తి (డి – ఆడిక్షన్) సెంటర్ గురించి గ్రామాల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.తెలంగాణ రాష్ట పోలీసు శాఖ చేపట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ ని పటిష్ట అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించిన 22 మంది అధికారులకు సిబ్బంది ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సమావేశంలో డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి, నాగేంద్రచారి,రవీందర్, సిఐ లు , ఆర్.ఐ లు ,ఎస్.ఐ లు , ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు
.