ఆనందం( Anandam ) సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ఆకాష్( Akash ) ఆ సినిమాతో తెలుగులోమంచి హీరో గా గుర్తింపు పొందాడు…ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడం తో ఆయన కి తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి.అవన్నీ చేస్తూనే చాలా రోజులపాటు ఇండస్ట్రీ లవర్ బాయ్ గా కూడా ఎదిగాడు.
కోడి రామకృష్ణ( Kodi Ramakrishna ) లాంటి పెద్ద డైరెక్టర్ తో పిలిస్తే పలుకుతా అనే సినిమాలో కూడా నటించి తాను ఏ క్యారెక్టర్ అయిన అలవోక గా చేసేస్తాడు అనే గుర్తింపు తెచ్చుకున్నాడు…ఇక ఆ తరువాత ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ బాగాలేకపోవడం వల్ల చాలా ప్లాప్ లు రావడం తో హీరోగా అవాకాశాలు తగ్గాయి దానితో సెకండ్ హీరోగా కూడా కొన్ని సినిమాల్లో చేసాడు.అందాల రాముడు,వసంతం,నవ వసంతం లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేసి ఇండస్ట్రీ లో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఇక ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ ఆయన చాలా రోజుల నుంచి తెలుగులో అసలు ఒక్క సినిమా కూడా చేయకుండా చాలా ఖాళీగా ఉంటున్నాడు.అయితే ఆయనకి ఆఫర్స్ ఏం రాకపోవడం తో ప్రస్తుతం ఆయన తమిళంలో వస్తున్న కొన్ని సీరియల్స్ లో కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది.ఆయన తెలుగు లో ఒక మంచి క్యారెక్టర్ దొరికితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్లీ తెలుగు లోకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు…అందుకే ఆయనకి పరిచయం ఉన్న డైరెక్టర్స్ అందరికి టచ్ లో ఉంటున్నట్టు తెలుస్తుంది.నిజంగానే ఆకాష్ ఒక మంచి క్యారెక్టర్ తో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తే ఆయన రూపంలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరికినట్టే, చూద్దాం మరి ఆయన అనుకున్నట్టుగా తెలుగు లో సినిమాలు చేస్తాడో లేక తమిళంలోనే సీరియల్స్ చేస్తూ ఉండిపోతాడో చూడాలి అంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు…