పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలి ఎల్లారెడ్డి పేటలో బి అర్ ఎస్ ధర్నా,రాస్తారోకో

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి- సిరిసిల్ల ప్రధాన రహదారి పైన ధర్నా, రాస్తా రోకో నిర్వహించారు.రోడ్డుపై వంటావార్పుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

 Raised Gas Cylinder Price Should Be Reduced Immediately Brs Dharna In Yella Redd-TeluguStop.com

సుమారు 200 మంది బి అర్ ఎస్ పార్టీ శ్రేణులు రోడ్డుపై కట్టెల పొయ్యి పెట్టి గ్యాస్ సిలిండర్ లతో ఆందోళన చేశారు.ప్ల కార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు.

మోడీ హటావో, దేశ్ కి నేత బచావో, వద్దురా నాయన బిజేపి పాలన, మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధరను మూడంతలుగా పెంచిన ఘనత బిజేపి పార్టీది అని దేశ ప్రజలను దోచుకొని అదానీ, అంబానీ కుటుంబాలకు కట్టబెడుతుండని ఆరోపించారు.

పేద మధ్యతరగతి మహిళల ఉసురు బిజెపి ప్రభుత్వానికి తప్పకుండా తలుగుతుందని, పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.బిజేపి పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

సుమారు 45 నిమిషాల పాటు ధర్నా రాస్తారోక నిర్వహించారు.బి అర్ ఎస్ పార్టీ నేతలు,కార్యకర్తలు చేపట్టిన రాస్తారోకో వల్ల రోడ్డు పై భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్ జామ్ కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ధర్నా కార్యక్రమాన్ని విరమింపజేశారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube