దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా మరొక వ్యక్తిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మద్యం కుంభకోణంలో ఢిల్లీ వ్యాపార వేత్త అమన్ దీప్ సింగ్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన సీఏ గోరంట్ల బుచ్చిబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా పడింది.
స్పెషల్ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి నాగ్ పాల్ సెలవులో ఉండటంతో తీర్పును వాయిదా వేశారు.