ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ చతుర్థి, మిలాద్ ఉల్ నబి పండుగలు జరుపుకోవాలి - ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రశాంతమైన వాతావరణంలో రాబోవు గణేష్ చతుర్థి, మిలాద్ ఉల్ నబి పండుగలు జరుపుకోవాలనీ రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.శనివారం రోజున వేములవాడ పట్టణంలోని బింగి మహేష్ ఫంక్షన్ హాల్ లో పట్టణ పరిధిలోని, వేములవాడ రూరల్ పరిధిలోని అన్ని గణేష్ మండలి నిర్వాహకులతో సన్నాహక సమావేశం నిర్వహించి రాబోవు గణేష్ చతుర్దశి,మిలాద్ ఉన్నభీ పండుగలలో తీసుకోవలసిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

 Sp Akhil Mahajan About Ganesh Chaturthi And Milad Un Nabi Festivals, Sp Akhil Ma-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రానున్న పండుగలను అందరము శాంతి యుతంగా నిర్వహించుకోవాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని,గణేష్ మండప నిర్వహికులు ప్రతిమలు ( విగ్రహం ) ఏర్పాటు చేసే ముందు అన్ని రకాల చర్యలు అనగా షేడ్ నిర్మాణం దాని నాణ్యత, కరెంటు సౌకర్యాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రజలకు,వాహన దారులకు ఎలాంటి అసౌకర్యంకాకుండ మండపాలు రోడ్ మీద ఏర్పాటు చేయకూడదాని, నిమజ్జనంలో రోజు తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలగునవి క్షుణ్ణంగా వివరించారు.

ఈ సంవత్సరం ఏర్పాటు చేసే గణేష్ మండపాల సమాచారాన్ని సంబంధిత పోలీస్ అధికారులకు తప్పకుండా తెలియచేయాలని,ప్రతి మండపం వద్ద పాయింట్స్ బుక్స్ ఏర్పటు చేయడం జరుగుతుంది అని పోలీస్ అధికారులు, బ్లూ కోల్ట్ సిబ్బంది తరచు తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు.

గణేష్ మండపాల వద్ద భాద్యత కలిగిన నిర్వహణ కమిటీ సభ్యులదే అని మండపం వద్ద అశాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన మండప నిర్వహులదే పూర్తి బాధ్యత అని వారిమీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.మండపాల్లో గాని,నిమార్జనం రోజున గాని డీజే లకు అనుమతి లేదని ఎలాంటి అనుమతి లేకుండా డీజే లను ఏర్పాటు చేసుకున్నట్లు అయితే వారిని బైండోవర్ చేయడం జరుగుతుందని అన్నారు.

నిమర్జనం రోజున మండప నిర్వహణ సభ్యులు పోలీసులకు సహకరిస్తూ శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరారు.రాబోవు ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరు భక్తి శ్రద్దలతో పండుగలు నిర్వహించుకోవలన్నారు.

ఎవరైనా పార్టీ కి సబంధించిన పాటలు పెట్టకూడదాని అలా చేసి శాంతి భద్రతల కు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహారించడం జరుగుతుంది అన్నారు.ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ లు కరుణాకర్, కృష్ణకుమార్, వేములవాడ రూరల్ ఎస్.ఐ మారుతి,ఎస్.ఐ లు రమేష్, ప్రశాంత్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube