చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతున్నారా? అయితే మీరు ఇవి తినాల్సిందే!

వయసు పైబడిన తర్వాత మతిమరుపు రావడం అనేది సర్వసాధారణం.కానీ నేటి ఆధునిక కాలంలో చాలా మంది ముప్పై, నలభై ఏళ్ల వయసులోనే మతిమరుపుకు గురవుతున్నారు.

 These Foods Help To Get Rid Of Forgetting , Foods, Forgetting, Latest News, Heal-TeluguStop.com

నిద్రను నిర్లక్ష్యం చేయడం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, ధూమపానం, మద్యపానం తదితర కారణాల వల్ల మెదడు పనితీరు నెమ్మదిస్తుంది.దాంతో జ్ఞాపక శక్తి తగ్గి చిన్న చిన్న విషయాల‌ను సైతం మరచిపోతుంటారు.

ఇలా మరచిపోయిన విషయాలు కొద్దిసేపటికి గుర్తుకు రావచ్చు, కొందరికి గుర్తుకు రాకపోవచ్చు.ఏదేమైనప్పటికీ మతిమరుపు వల్ల ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.అందుకే మతిమరుపుకు తొలి దశలోనే చెక్ పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.

మరి ఇంతకీ ఆ ఆహారాలు ఏంటి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లిపాయ..జ్ఞాపకశక్తిని రెట్టింపు చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ముఖ్యంగా రోజు పచ్చి ఉల్లిపాయను తీసుకుంటే కనుక అందులో పలు పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి.బీట్ రూట్‌.ఇది ఆరోగ్యానికి అందించే అపారమైన ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.అయితే మెదడు ఆరోగ్యానికి కూడా బీట్ రూట్ ఎంతో మేలు చేస్తుంది.

రోజు ఒక గ్లాసు బీట్ రూట్‌ జ్యూస్ తీసుకున్నట్లయితే మతిమరుపు అన్న మాటే అనరు.

గ్రీన్ టీ. చాలా మంది దీన్ని వెయిట్ లాస్‌కు మాత్రమే ఉపయోగపడుతుందని భావిస్తుంటారు.కానీ గ్రీన్ టీ మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను సైతం అందిస్తుంది.

ముఖ్యంగా రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ ని తీసుకుంటే.అందులో ఉండే ప్ర‌త్యేక సుగుణాలు ఒత్తిడిని తగ్గించి జ్ఞాపకశక్తిని, ఆలోచన శక్తిని మెరుగుపరుస్తాయి.

మతిమరుపు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తాయి.

టమాటో.

అత్యధికంగా వినియోగించే కూరగాయ ఇది.అయితే టమాటోలు రుచిగా ఉండడమే కాదు బోలెడన్ని పోషకాలను కూడా కలిగి ఉంటాయి.రోజుకు ఒకటి లేదా రెండు టమాటోల‌ను తీసుకుంటే మతిమరుపు సమస్యకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube