సాధారణంగా అమ్మాయిలు తమ జుట్టు నల్లగా, ఒత్తుగా, అందంగా ఉండాలని కోరుకుంటుంటారు.నిజానికి జుట్టు అలా ఉంటేనే అమ్మాయి అందంగా కనిపిస్తారు.
కానీ, కోరుకున్న దానికంటే భిన్నంగా కేశాలు ఉంటాయి.తరచూ పోట్లపోవడం, ఊడిపోవడం, చిట్లిపోవడం, చుండ్రు, డ్రైగా మారిపోవడం ఇలా అనేక జుట్టు సమస్యలు వెంటాడు తుంటాయి.
దీంతో ఈ సమస్యల నుంచి బయటపడేందుకు రకరకాల షాంపూలు, ఆయిల్స్ వాడుతుంటారు.కానీ, న్యాచురల్‌గా కూడా జుట్టు సమస్యలను దూరం చేసుకోవచ్చు.
ముఖ్యంగా కొబ్బరి పాలతో ఎలాంటి కేశ సంబంధిన సమస్యలైనా నివారించుకోవచ్చు.మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా హెయిర్ ఫాల్ చాలా మంది వేధించే సమస్య.అయితే అలాంటి వారు రాత్రి నిద్రించే ముందు ఒక అర కప్పు కొబ్బరి పాలలో రెండు స్పూన్ల మెంతులు వేసి నానబెట్టాలి.
ఉదయాన్ని దానిని బాగా గ్రైండ్ చేసుకుని.తలకు, కేశాలకు పట్టించాలి.
ఇక గంట పాటు వదిలేసి.ఆ తర్వాత తలస్నానం చేసేయాలి.
ఇలా వారినికి రెండు సార్లు చేస్తే.జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా మరియు నల్లగా పెరుగుతుంది.
చుండ్రు సమస్యతో ఇబ్బంది పడే వారు.ఒక బౌల్‌లో కొబ్బరి పాలు తీసుకుని.అందులో కొద్దిగా నిమ్మ రసం యాడ్ చేయాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టు కుదళ్లకు బాగా పట్టించి.అరగంట లేదా గంట తర్వాత గోరు వెచ్చని నీటితో హెడ్ బాత్ చేసేయాలి.ఇలా మూడు రోజులకు ఒక సారి చేస్తే.
ఖచ్చితంగా చుండ్రు పోతుంది.
జుట్టు పొట్లిపోవడం తగ్గాలంటే.
ఒక బౌల్‌లో కొబ్బరి పాలు, కొబ్బరి నూనె మరియు ఆలివ్ ఆయిల్ వేసి కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని తలకు, కేశాలకు పట్టించి.
గంట పాటు వదిలేయాలి.అనంతరం తలస్నానం చేయాలి.
ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల జుట్టు పొట్లి పోవడం తగ్గి.ఒత్తుగా పెరుగుతుంది.