రాజన్న సిరిసిల్ల జిల్లా :సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ 26వ రోజు దీక్షలో భాగంగా శనివారం ఉద్యోగులు అగ్రహారం జోడు ఆంజనేయస్వామి ఆలయం లో హనుమాన్ భజన చేసి నిరసన తెలియజేశారు.కలెక్టరేట్ చౌరస్తా నుంచి అగ్రహారం జోడు ఆంజనేయ స్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించేలా చూడాలంటూ ఆలయంలో 11 ప్రదక్షిణలు నిర్వహించి, భజనలు చేశారు.
అనంతరం ఆలయం ముందున్న కరీంనగర్-సిరిసిల్ల రహదారి వద్ద మానవహారంగా ఏర్పడి ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని, అంతవరకు పే స్కేల్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
దీక్ష శిబిరం వద్ద గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోటీ చేయనున్న మధునం గంగాధర్ సందర్శించి వారికి సంఘీభావాన్ని తెలిపారు.ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష జాక్ అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.