రాజన్న సిరిసిల్ల జిల్లా: వైకుంఠ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని వేకువజామునే కలిసి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.
అనంతరం స్వామివారి పల్లకి సేవ పెద్ద సేవలో పాల్గొని తరించారు.వైకుంఠ ముక్కోటి ఏకాదశి మహోత్సవ విశిష్టత ప్రవచన కార్యక్రమాల్లో పాల్గొన్నారు
వారు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు.
ధనుర్మాసంలో సూర్యుడు ధనస్సు లోకి ప్రవేశించిన సమయంలో వచ్చిన ఏకాదశిని వైకుంఠ ఏకాదశి చేరుకోవడం జరుగుతుందని అన్నారు.భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఈ రోజు కొలవడం వలన పుణ్యఫలాలు లభిస్తాయని తెలిపారు.
ఈ పర్వదినం సందర్భంగా లోక కళ్యాణం జరగాలని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.