రాజన్న సిరిసిల్ల జిల్లా: ఉపాధ్యాయుడి జన్మదినం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు ఆటవస్తులకు రూ.15వేల నగదు వితరణ చేసితన ఉదారతను చాటుకున్నాడు ఉపాధ్యాయుడు ముత్యాల శ్రీనివాస్ రెడ్డి.ఎల్లారెడ్డిపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సీనియర్ ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ముత్యాల శ్రీనివాస్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా పాఠశాల లోని విద్యార్థుల ఆట వస్తువులకు 15 వేల రూపాయలను పాఠశాల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మనోహర చారి కి అందించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణ హరి, ఎంపీడీవో సత్తయ్య, డిప్యూటీ తాసిల్దార్ సత్యనారాయణ, లయన్స్ క్లబ్ సభ్యులు ,మాజీ సర్పంచ్ కొండాపురం బాల్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డి, షేక్ గౌస్, చెన్ని బాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెండే శ్రీను,నంది కిషన్, లయన్స్ క్లబ్ సెక్రెటరీ నాయిని భాస్కర్ రెడ్డి, ముత్యం రెడ్డి ,పాఠశాల ఉపాధ్యాయులు హన్మండ్లు, స్వామి,శైలజ ,శంకర్, ప్రభాకర్, శ్రీనివాస్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.