రాజన్న సిరిసిల్లా జిల్లాలో పూర్తి స్థాయిలో బీసీ సాధికారిత సంఘం కమిటీలను ఏర్పాటు చేసుకొనుటకై బీసీ నేతలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారత సంఘం కన్వీనర్ పొలాస నరేందర్ విజ్ఞప్తి చేశారు.
రాజన్న సిరిసిల్లా జిల్లా బీసీ సాధికారిత సంఘం నేతలను ,గౌరవ సభ్యులను కోరినది ఏమనగా,ఇప్పటి వరకు బీసీ సాధికారిత సంఘం పక్షాన జిల్లా బీసీ సాధికారిత సంఘం మేన్ కమిటీ, పట్టణ కమిటీ, పట్టణ యువత కమిటీ, జిల్లా యువత కమిటీల తో పాటుగా, పట్టణ మహిళ కమిటీ,జిల్లా మహిళ కమిటీలను ప్రకటించుకోవడం జరిగిందని తెలిపారు.
పట్టణ వార్డ్ కమిటీలను, జిల్లాలోని అన్ని మండలాలలో మండల ప్రధాన కమిటీలను, మండల అనుబంధ కమిటీలను ,అంతే కాకుండా గ్రామ స్థాయి కమిటీలను వేసుకోవాల్సి ఉందని తెలిపారు.
జిల్లాలో అన్ని బీసీ సంఘాల కమిటీలను ఏర్పాటు చేసుకొని ,త్వరలో ప్రతినిధుల సదస్సును ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నందున, త్వరగా కమిటీలను ఏర్పాటు చేయగలరని గౌరవ బీసీ సాధికారిత సంఘం జిల్లా, పట్టణ మేన్ కార్యవర్గాన్ని, జిల్లా మహిళ, పట్టణ మహిళ కార్యవర్గాన్ని, పట్టణ యువత, జిల్లా యువత కార్యవర్గాన్ని అయన కోరారు.