జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం, పెద్ద లింగాపూర్ గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల నాల్గవ సంవత్సరం విద్యార్థులు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం యొక్క ప్రారంభోత్సవ వేడుకలు రైతు వేదికలో శుక్రవారం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంఏఓ ఎం.

 National Service Scheme Special Camp, National Service Scheme, Special Camp, Raj-TeluguStop.com

సురేష్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సేవ పథకంలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థి తమవంతు సేవా ఈ గ్రామానికి అందించాలని తెలిపారు.తరువాత కళాశాల అసోసియేట్ డీన్ ఇన్చార్జ్ డాక్టర్.

రజియా సుల్తానా మాట్లాడుతూ, ఈ ప్రత్యేక శిబిరం ఏడు రోజులపాటు పెద్ద లింగాపూర్ గ్రామంలో నిర్వహిస్తారని, ఇందులో ప్రతిరోజు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు.

అనంతరం, క్యాంపింగ్ లో భాగంగా జిల్లా పరిషత్ పాఠశాల పరిసరాలను విద్యార్థులు శుభ్రం చేసి ప్రజలకు పరిశుభ్రం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ అవగాహన కల్పించారు.

ఈ గ్రామీణ సేవా పథకంలో ఎంఏవో ఎం.సురేష్, ఎంపీడీవో బి.శ్రీనివాస్ మూర్తి , కరీంనగర్ డి ఏ ఏ టీ టీ సి కోఆర్డినేటర్ డాక్టర్.మదన్మోహన్ రెడ్డి , గ్రామ కార్యదర్శి రంజిత్ , అసోసియేట్ డీన్ ఇంచార్జ్ డాక్టర్.

రజియా సుల్తానా , ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ టి.అరుణ్ బాబు, కె.భవ్యశ్రీ, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube